Telugu Global
Cinema & Entertainment

కంగ‌నాకు మ‌హ‌ర్ధ‌శ‌..! 

ఎవ‌డైతే నాకేంటి.. నాకు ఏది న‌చ్చిదే..అది ఫైన‌ల్ అనుకునే కెట‌గిరి కి చెందిన హీరోయిన్ కంగ‌న రనాత్‌.  తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న  ఏక్ నిరంజ‌న్ అనే సినిమా చేసింది.  బాలీవుడ్ లో ఎవ‌రి గురించి అయిన‌..ఏ విష‌య‌మైన దాప‌రికం లేకుండా  కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడ‌టం ఆమే నైజం. దీని కార‌ణంగా అఫ‌ర్స్ రాక పోయినా.. బిందాజ్ అనుకుంటుంది.  న‌టిగా త‌ను ఎంత ప్రతిభ వంతురాలో గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి చాటుతూనే వుంది.  గత యేడాది […]

కంగ‌నాకు మ‌హ‌ర్ధ‌శ‌..! 
X

ఎవ‌డైతే నాకేంటి.. నాకు ఏది న‌చ్చిదే..అది ఫైన‌ల్ అనుకునే కెట‌గిరి కి చెందిన హీరోయిన్ కంగ‌న రనాత్‌. తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న ఏక్ నిరంజ‌న్ అనే సినిమా చేసింది. బాలీవుడ్ లో ఎవ‌రి గురించి అయిన‌..ఏ విష‌య‌మైన దాప‌రికం లేకుండా కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడ‌టం ఆమే నైజం. దీని కార‌ణంగా అఫ‌ర్స్ రాక పోయినా.. బిందాజ్ అనుకుంటుంది.

న‌టిగా త‌ను ఎంత ప్రతిభ వంతురాలో గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి చాటుతూనే వుంది. గత యేడాది క్వీన్..ఈ యేడాది త‌ను వెడ్స్ మ‌ను చిత్రాల‌తో త‌న టాలెంట్ ను చాటుకుంది. దీంతో ఫిల్మ్ మేక‌ర్స్ కు కంగ‌న టాలెంట్ పై మ‌రింత న‌మ్మ‌కం కుదిరింది. దీంతో తాజాగా బి టౌన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ ను కంగ‌న లీడ్ రోల్ లో ప్లాన్ చేస్తున్నార‌ని టాక్. చారిత్రిక ప్రాధ్యానం వున్న ఝాన్సిల‌క్ష్మీ బాయ్ జీవిత క‌థ ఆధారంగా సినిమాను చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తున్నారు. బిట్రిష్ సామ్రాజ్య పాల‌న‌తో వారిని ఎద‌రించి పోరాడిన వీర వ‌నిత గా ఝాన్సిల‌క్ష్మీ బాయ్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఒక సువ‌ర్ణ ఆధ్యాయం లిఖించుకుంది. మ‌రి అంత ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేసే అవ‌కాశం ఈ ముద్దుగుమ్మ‌కు ద‌క్క‌డం అంటే..ఇది నిజంగా కంగ‌న టాలెంట్ కు ద‌క్కిన గుర్తింపే అనుకోవాలి.

First Published:  11 July 2015 8:00 AM
Next Story