Telugu Global
NEWS

గ్రేటర్ కార్మిక సంఘాల్లో చీలికకు సోమేష్ యత్నం?

స‌మ్మె విర‌మ‌ణ‌పై రెండు సంఘాలు అనుకూలం… ఏడు వ్య‌తిరేకం జీహెచ్‌ఎంసీ కార్మికులు గత నాలుగు రోజులుగా చేస్తోన్న నిరవధిక సమ్మెను ఏదో రకంగా భ‌గ్నం చేయాల‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే కార్మిక సంఘాల్లో ఉన్న ఐక్య‌త‌ను దెబ్బ‌తీయ‌డానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సోమేష్‌=కుమార్ చేస్తున్న ప్రయతనాలను  వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈమేరకు ఇవాళ కార్మిక సంఘాల నేతలతో హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌ చర్చలు జరిపారు. ఇవి […]

గ్రేటర్ కార్మిక సంఘాల్లో చీలికకు సోమేష్ యత్నం?
X
స‌మ్మె విర‌మ‌ణ‌పై రెండు సంఘాలు అనుకూలం… ఏడు వ్య‌తిరేకం
జీహెచ్‌ఎంసీ కార్మికులు గత నాలుగు రోజులుగా చేస్తోన్న నిరవధిక సమ్మెను ఏదో రకంగా భ‌గ్నం చేయాల‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే కార్మిక సంఘాల్లో ఉన్న ఐక్య‌త‌ను దెబ్బ‌తీయ‌డానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సోమేష్‌=కుమార్ చేస్తున్న ప్రయతనాలను వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈమేరకు ఇవాళ కార్మిక సంఘాల నేతలతో హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌ చర్చలు జరిపారు. ఇవి సఫలమవడంతో సమ్మె విరమిస్తున్నట్టు టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంస్థ నేత వినోద్ తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో కార్మికుల సంక్షేమం కూడా భాగమని, దీని కోసం రాష్ట్ర సర్కారుకు బాసటగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే సమ్మెనుంచి తప్పుకుంటున్నట్టు జీహెచ్‌ఎం ఈయూ నాయకుడు గోపాల్‌ తెలిపారు. ప్రభుత్వంతో చర్చల సందర్బంగా 380 మంది ఎన్‌ఎంఆర్‌లను పర్మినెంట్‌ చేయడంతోపాటు వేతనాల పెంపు, హెల్త్‌ కార్డులు తదితర సమస్యలను ఈనెల 30లోగా నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. కుమార్‌ నాయకత్వంలోని నవ తెలంగాణ యూనియన్‌ కూడా ప్రభుత్వ హామీతో సమ్మె నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. వీరంతా తక్షణం విధులకు హాజరవుతారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ ప్రకటించారు. తమ డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం తరపున కమిషనర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్టు పేర్కొన్నారు.
సోమేష్‌ తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు
మరోవైపు సమ్మెను విచ్చిన్నం చేయడానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌ చేస్తున్న ప్రయత్నాలను ఏడు కార్మిక సంఘాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. హెచ్‌ఎంఎస్‌, బిఎంఎస్‌, ఏఐటీయుసీ, ఐఎఫ్‌టీయు, ఏఐయుటీయుసి, టీఎన్‌టీయుసి, జిహెచ్‌ఎంసీ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు సోమేష్‌ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. చర్చల పేరుతో పిలిచి ప్రభుత్వం, అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, కార్మిక సంఘాలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ప్రతిఫలం ఏదో రోజు చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయా సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. గుర్తింపు లేని టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘంతో సమ్మె విరమింపజేసి సమస్య పరిష్కారమైనట్టు ప్రకటనలు చేస్తున్న తీరును మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్న విషయం మరిచిపోవద్దని సోమేష్‌ను వారు హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగించి తీరుతామని వారు స్పష్టం చేశారు.
First Published:  11 July 2015 12:50 AM IST
Next Story