Telugu Global
International

షాంఘై సహకార సంస్థలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం

చైనాలోని షాంఘై నగరం కేంద్రంగా పని చేస్తున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కింది. గత పదేళ్ల నుంచి పరిశీలక దేశం హోదాలో ఉన్న భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం ఇచ్చినందుకు ప్రధాని మోడీ ఎసీసీవో సభ్యదేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసియాలో శాంత సౌభాగ్యాలు పెంపొందేదుకు ఎసీసీవోలో భారత సభ్యత్వం తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై కూటమితో కలిసి పని చేస్తామని, ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొల్పితే, ఆసియా మొత్తం సుస్థిరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. […]

షాంఘై సహకార సంస్థలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
X
చైనాలోని షాంఘై నగరం కేంద్రంగా పని చేస్తున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కింది. గత పదేళ్ల నుంచి పరిశీలక దేశం హోదాలో ఉన్న భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం ఇచ్చినందుకు ప్రధాని మోడీ ఎసీసీవో సభ్యదేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసియాలో శాంత సౌభాగ్యాలు పెంపొందేదుకు ఎసీసీవోలో భారత సభ్యత్వం తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై కూటమితో కలిసి పని చేస్తామని, ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొల్పితే, ఆసియా మొత్తం సుస్థిరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌కు లభించిన పూర్తి స్థాయి సభ్యత్వం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని రష్యాలోని ఉఫాలో జరుగుతున్న ఎసీసీవో సదస్సు ప్రకటించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌కు కూడా ఈ హోదా లభించింది. మధ్య ఆసియా దేశాల ఆర్థికాభివృద్ధికి, ఉగ్రవాదాన్ని నిరోధించడంలోనూ ఎస్‌సీవో కూటమి దన్నుగా నిలుస్తోంది. ఈ కూటమిలో ప్రస్తుతం చైనా, రష్యా, కజకిస్తాన్‌, కిర్గిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజకిస్థాన్‌ దేశాలకు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. గత ఏడాది భారత్‌ శాశ్వత సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోగా సభ్య దేశాల నుంచి ఆమోదం లభించింది. ఎస్‌సీవో సంస్థ సభ్య దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, ఉగ్రవాద నిర్మూలనలో సహకారం, ఇంధనరంగంలో ద్వైపాక్షిక సహకారం,వాణిజ్యాభివృద్ధి, మాదకద్రవ్యాల నిరోధం తదితర అంశాల్లో కృషి చేస్తోంది.
First Published:  11 July 2015 7:13 AM IST
Next Story