Telugu Global
Others

బాబు మెడ‌కు వికీలీక్స్ కేబుళ్లు!

అగ్ర‌రాజ్యం అమెరికాతో స‌హ ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న వికీలీక్స్ కేబుళ్లు ఈసారి చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకున్నాయి. స‌ద‌రు వికీలీక్స్ వెల్ల‌డించిన కేబుళ్ల‌లో ఏపీ ముఖ్య‌మంత్రి బాబు వ్య‌వ‌హారంపై  సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది న‌మ‌స్తే తెలంగాణ‌. ఓటుకు నోటుకుంభ‌కోణంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌తోపాటు, బాబు ఆడియోటేపుల వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట‌పెట్టి ఏపీ సీఎంకు చుక్క‌లు చూపిస్తున్న ఈ దిన‌ప‌త్రిక తాజాగా బాబు పాల్ప‌డ్డ‌ట్టుగా చెబుతున్న మ‌రో కుట్ర‌ను ప్ర‌చురించింది. 20-50 సెల్‌ఫోన్లు ట్యాపింగ్‌, కంప్యూట‌ర్ల‌పై నిఘా ఉంచేందుకు ఓ హ్యాకింగ్ […]

బాబు మెడ‌కు వికీలీక్స్ కేబుళ్లు!
X
అగ్ర‌రాజ్యం అమెరికాతో స‌హ ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న వికీలీక్స్ కేబుళ్లు ఈసారి చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకున్నాయి. స‌ద‌రు వికీలీక్స్ వెల్ల‌డించిన కేబుళ్ల‌లో ఏపీ ముఖ్య‌మంత్రి బాబు వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది న‌మ‌స్తే తెలంగాణ‌. ఓటుకు నోటుకుంభ‌కోణంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌తోపాటు, బాబు ఆడియోటేపుల వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట‌పెట్టి ఏపీ సీఎంకు చుక్క‌లు చూపిస్తున్న ఈ దిన‌ప‌త్రిక తాజాగా బాబు పాల్ప‌డ్డ‌ట్టుగా చెబుతున్న మ‌రో కుట్ర‌ను ప్ర‌చురించింది. 20-50 సెల్‌ఫోన్లు ట్యాపింగ్‌, కంప్యూట‌ర్ల‌పై నిఘా ఉంచేందుకు ఓ హ్యాకింగ్ టీమ్‌తో బేర‌సారాలు జ‌రిపార‌ని, అందుకు సంబంధించిన ఈ-మెయిళ్ల‌ను ఆధారాల‌తో స‌హా ప్ర‌చురించింది. ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలితే.. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ నెత్తీ నోరు బాదుకుంటున్న టీడీపీ నేత‌ల గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డ్డ‌ట్లే! ప్ర‌స్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాఫ్ట్ట్‌వేర్‌ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఇందులో చంద్రబాబు సర్కారు బాగోతం వెలుగుచూసింది. సదరు టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థతో సంప్రదింపులు నడిపారని బ‌య‌టికి వ‌చ్చిన ఈ-మెయిళ్లు చెబుతున్నాయి. ఇందుకోసం స‌ద‌రు హ్యాకింగ్ టీమ్‌కు రూ.7.5 కోట్లు చెల్లించేందుకు, బ‌యానా కింద రూ.1కోటి కూడా ఇచ్చేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలిసింది. ఇదంతా తెలంగాణ ప్ర‌భుత్వంపైనే ప్ర‌యోగించేందుకు చేసిన ప్ర‌య‌త్నంగా ఆరోపించింది.
First Published:  11 July 2015 2:44 AM IST
Next Story