Telugu Global
Health & Life Style

కాంటాక్ట్ లెన్స్‌తో భ‌ద్రం సుమా!

కంఫ‌ర్ట్ కోసం కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారా….! అయితే, జ‌ర జాగ్ర‌త్త. మామూలు వారి కంటే కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న‌వారి కంటిలో బ్యాక్టీరియా కాస్త ఎక్కువ‌గా వ్యాపిస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు‌. అందువ‌ల్ల వారికి కంటి ఇన్‌ఫెక్ష‌న్లు కూడా ఎక్కువ‌గా సోకుతాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. అమెరిక‌న్ సొసైటీ ఫ‌ర్ మైక్రో బ‌యాల‌జీ నిర్వ‌హించిన వార్షిక స‌ద‌స్సులో ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. కాంటాక్ట్‌లెన్స్‌లు ధ‌రించేవారిపైన‌,… ధ‌రించ‌ని వారిపైన…  ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించి ఫ‌లితాలు రాబ‌ట్టారు. సాధార‌ణంగా కంటిలో ఇన్‌ఫెక్ష‌న్ల‌తో పోరాడే బ్యాక్టీరియా […]

కాంటాక్ట్ లెన్స్‌తో భ‌ద్రం సుమా!
X
కంఫ‌ర్ట్ కోసం కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారా….! అయితే, జ‌ర జాగ్ర‌త్త. మామూలు వారి కంటే కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న‌వారి కంటిలో బ్యాక్టీరియా కాస్త ఎక్కువ‌గా వ్యాపిస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు‌. అందువ‌ల్ల వారికి కంటి ఇన్‌ఫెక్ష‌న్లు కూడా ఎక్కువ‌గా సోకుతాయ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. అమెరిక‌న్ సొసైటీ ఫ‌ర్ మైక్రో బ‌యాల‌జీ నిర్వ‌హించిన వార్షిక స‌ద‌స్సులో ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. కాంటాక్ట్‌లెన్స్‌లు ధ‌రించేవారిపైన‌,… ధ‌రించ‌ని వారిపైన… ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించి ఫ‌లితాలు రాబ‌ట్టారు. సాధార‌ణంగా కంటిలో ఇన్‌ఫెక్ష‌న్ల‌తో పోరాడే బ్యాక్టీరియా ఉంటుంది. కొంత‌కాలం కాంటాక్ట్ లెన్స్‌లు ఉప‌యోగిస్తే ఆ బ్యాక్టీరియా క్ర‌మంగా అంత‌రించి పోతుంది. క‌నురెప్ప‌ల వ‌ద్ద ఉండే బ్యాక్టీరియాతో పోలిన దానిలా అది రూపం మార్చుకుంటుంది. ఫ‌లితంగా క‌ళ్ళు ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. అయితే, ఇది కాంటాక్ట్ లెన్స్‌ల వ‌ల‌న జ‌రుగుతోందా, లేదా అవి అమ‌ర్చే స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక పోవ‌డం వ‌ల్ల జ‌రుగుతోందా అన్న విష‌యం ఇంకా నిర్థార‌ణ కాలేద‌ని ఈ ప‌రిశోధ‌న‌లు చేస్తున్న వైద్యులు చెబుతున్నారు. ఎందుక‌యినా మంచిది మ‌న చేతిలో ఉన్న జాగ్ర‌త్త‌లు మ‌నం తీసుకుని త‌ర్వాత భారాన్ని కాలానికే వ‌దిలేద్దాం….
First Published:  11 July 2015 10:49 AM IST
Next Story