Telugu Global
Others

ఇండోనేషియాలో విమానాశ్రయాల బంద్‌ 

అగ్నిపర్వతాల పేలుళ్ల భయంతో బాలితో సహా ఐదు విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. ఇక్కడ  అగ్నిపర్వతాల పేలుళ్లు ఎప్పుడూ భయపెడుతూనే ఉంటాయి. తాజాగా ఈస్ట్‌జోవా ప్రాంతంలోని రౌంగ్‌  అగ్నిపర్వతం వారం రోజులుగా పొగలు, బూడిద విరజిమ్ముతుండడంతో ఐదు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆకాశమంతా పొగ కమ్మేసి ఉండడంతో విమాన ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తడంతో విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో, బాలి, లాంబోక్‌, సెలాపరాంగ్‌, బింబింగ్‌సారి, నోటో, హడింగోరా విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు […]

ఇండోనేషియాలో విమానాశ్రయాల బంద్‌ 
X
అగ్నిపర్వతాల పేలుళ్ల భయంతో బాలితో సహా ఐదు విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. ఇక్కడ అగ్నిపర్వతాల పేలుళ్లు ఎప్పుడూ భయపెడుతూనే ఉంటాయి. తాజాగా ఈస్ట్‌జోవా ప్రాంతంలోని రౌంగ్‌ అగ్నిపర్వతం వారం రోజులుగా పొగలు, బూడిద విరజిమ్ముతుండడంతో ఐదు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆకాశమంతా పొగ కమ్మేసి ఉండడంతో విమాన ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తడంతో విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో, బాలి, లాంబోక్‌, సెలాపరాంగ్‌, బింబింగ్‌సారి, నోటో, హడింగోరా విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సర్వీసులు పునరుద్ధరించడంతో పాటు అదనపు సర్వీసులు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని అధికారులు ప్రకటించారు.
First Published:  10 July 2015 6:40 PM IST
Next Story