విశ్రాంత ఉద్యోగులకు పాత పద్దతిలోనే అదనపు పెన్షన్
రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల కోసం పదో పీఆర్‌సీ చేసిన సిఫారుసులను అమలు చేయడానికి వెనకాడుతోంది. 75 సంవత్సరాలు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అంతవరకు ఉన్న పెన్షన్‌కు పదిహేను శాతం కలిపి చెల్లిస్తున్నఅదనపు పెన్షన్‌ను పెంచాలన్నపీఆర్‌సీ సిఫారుసును ఆర్ధిక శాఖ నిరాకరించింది. దీంతో పాత విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌లను మాత్రం పీఆర్‌సీ సిఫారుసుల ప్రకారం ఇచ్చేందుకు అంగీకరించింది. వీటికి సంబంధించిన ఫైళ్లను ఆర్థికశాఖ ముఖ్యమంత్రి ఆమోదానికి పంపింది. రిటైర్డ్ ఉద్యోగులు […]
BY sarvi10 July 2015 6:39 PM IST
sarvi Updated On: 11 July 2015 8:50 AM IST
రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల కోసం పదో పీఆర్‌సీ చేసిన సిఫారుసులను అమలు చేయడానికి వెనకాడుతోంది. 75 సంవత్సరాలు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అంతవరకు ఉన్న పెన్షన్‌కు పదిహేను శాతం కలిపి చెల్లిస్తున్నఅదనపు పెన్షన్‌ను పెంచాలన్నపీఆర్‌సీ సిఫారుసును ఆర్ధిక శాఖ నిరాకరించింది. దీంతో పాత విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌లను మాత్రం పీఆర్‌సీ సిఫారుసుల ప్రకారం ఇచ్చేందుకు అంగీకరించింది. వీటికి సంబంధించిన ఫైళ్లను ఆర్థికశాఖ ముఖ్యమంత్రి ఆమోదానికి పంపింది. రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తే అందించే డెత్ అలవెన్స్‌లను పెంచాలని పీఆర్‌సీ చేసిన సిఫారుసును అంగీకరించింది. అయితే, పీఆర్‌సీ సిఫారుసుల్లో హేతుబద్ధంగా లేని అంశాలపైనే తాము అభ్యంతరాలు వ్యక్తం చేశామని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
Next Story