Telugu Global
National

రజనీ, అమితాబ్‌నే పక్కనబెట్టారా?

ఎఫ్‌టీఐఐ చైర్మన్ నియామ‌కంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణ‌యాలు ప్ర‌స్తుతం వివాదాస్ప‌దంగా మారాయి. ఈ క‌మిటీకి  రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ నటుల పేర్లను కమిటీ సిఫారసు చేసినా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పక్కనబెట్టినట్టు వెలుగులోకి రావ‌డ‌మే ఇందుకుకార‌ణం. గత ఏడాది జూన్‌లో కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై  సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించింది. ప్రముఖ దర్శకులు ఆదూర్ గోపాలకృష్ణన్, శ్యాంబెనగల్, […]

రజనీ, అమితాబ్‌నే పక్కనబెట్టారా?
X
ఎఫ్‌టీఐఐ చైర్మన్ నియామ‌కంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణ‌యాలు ప్ర‌స్తుతం వివాదాస్ప‌దంగా మారాయి. ఈ క‌మిటీకి రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ నటుల పేర్లను కమిటీ సిఫారసు చేసినా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ పక్కనబెట్టినట్టు వెలుగులోకి రావ‌డ‌మే ఇందుకుకార‌ణం. గత ఏడాది జూన్‌లో కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించింది. ప్రముఖ దర్శకులు ఆదూర్ గోపాలకృష్ణన్, శ్యాంబెనగల్, నటుడు అనుపమ్ ఖేర్ పేర్లతో తొలి జాబితాను కమిటీ పంపింది. దానిపై మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, దర్శకుడు ప్రదీప్ సర్కార్ పేర్లను డిసెంబర్‌లో కమిటీ సిఫారసు చేసింది. దీన్ని కూడా మంత్రిత్వశాఖ పక్కన బెట్టి.. గజేంద్ర చౌహాన్ పేరును ప్రకటించింది. ఆరెస్సెస్ ప్రోద్బలంతోనే ఆయనకు పదవి కట్టబెట్టారని, పైగా గజేంద్ర ఎలాంటి అర్హతలు లేని వ్యక్తి అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై న‌టుడు రిషీక‌పూర్ కూడా స్పందించారు. ఈ ప‌ద‌వికి నువ్వు అర్హుడి కాదు మ‌ర్యాద‌గా త‌ప్పుకోవాల‌ని సూచించాడు. అయితే ఇందుకు ప్రస్తుత ఎఫ్‌టీఐఐ చైర్మన్ గజేంద్ర చౌహాన్ రిషీవ్యాఖ్య‌ల‌ను ఖండించారు. తాను త‌ప్పుకోలేద‌ని స్ప‌ష్టంచేశారు. అయితే.. రజనీ, అమితాబ్ పేర్లను పక్కనబెట్టి గజేంద్రకు పదవి కట్టబెట్టినట్టు తాజాగా వార్తలు రావడంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ స్పందిస్తూ.. నియామకంలో ఎలాంటి శక్తుల ప్రోద్బలం లేదని, కమిటీ సూచనల మేరకే అంతా జరిగిందన్నారు.
First Published:  11 July 2015 5:40 AM IST
Next Story