గోదారమ్మకు సారె పంపిన శ్రీవారు
గోదావరి తల్లి పుష్కరాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం నుంచి ఆమెకు పసుపు కుంకుమల సారె పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిలతో కూడిన కళ్యాణ రథాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజులు ప్రారంభించారు. పట్టువస్త్రాలు, పసుపు,కుంకుమలతో కూడిన సారెను గురువారం ఉదయం శ్రీవారి ఆలయ మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులతో కూడిన కళ్యాణ రథంలో శ్రీవారు పంపిన సారెతో […]
BY Pragnadhar Reddy9 July 2015 6:36 PM IST
Pragnadhar Reddy Updated On: 10 July 2015 5:24 AM IST
గోదావరి తల్లి పుష్కరాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం నుంచి ఆమెకు పసుపు కుంకుమల సారె పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిలతో కూడిన కళ్యాణ రథాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజులు ప్రారంభించారు. పట్టువస్త్రాలు, పసుపు,కుంకుమలతో కూడిన సారెను గురువారం ఉదయం శ్రీవారి ఆలయ మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులతో కూడిన కళ్యాణ రథంలో శ్రీవారు పంపిన సారెతో తిరుమల నుంచి రాజమండ్రికి శోభాయాత్రగా బయలు దేరి ఈనెల 11వ తేదీన రాజమండ్రిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయానికి చేరుకుంటుంది, 14వ తేదీన గోదావరి మాతకు తిరుమల శ్రీవారు పంపిన పట్టువస్త్రాలు, పసుపు కుంకుమలతో కూడిన సారెను టీటీడీ అధికారులు సమర్పిస్తారు.
Next Story