14 నుంచి పుష్కరాలకు ట్రూజెట్ సేవలు
టర్బో మెగా ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమనాలు ఇక నుంచి దేశ వ్యాప్తంగా ట్రూజెట్ విమాన సర్వీసులుగా సేవలందించనున్నాయి. ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ హీరో రామ్‌చరణ్ ప్రమోట్ చేస్తున్న ఈ “టర్బో మెగా” ఎయిర్‌వేస్ కార్యకలాపాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తాజ్ డక్కన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్‌చరణ్ మాట్లాడుతూ మెగా ఎయిర్‌వేస్‌కు అన్ని అనుమతులు వచ్చాయన్నారు. ప్రజా రవాణాకు ఈనెల 12 నుంచి ట్రూజెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల […]
BY sarvi10 July 2015 9:46 AM IST
X
sarvi Updated On: 10 July 2015 9:46 AM IST
టర్బో మెగా ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమనాలు ఇక నుంచి దేశ వ్యాప్తంగా ట్రూజెట్ విమాన సర్వీసులుగా సేవలందించనున్నాయి. ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ హీరో రామ్‌చరణ్ ప్రమోట్ చేస్తున్న ఈ “టర్బో మెగా” ఎయిర్‌వేస్ కార్యకలాపాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తాజ్ డక్కన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్‌చరణ్ మాట్లాడుతూ మెగా ఎయిర్‌వేస్‌కు అన్ని అనుమతులు వచ్చాయన్నారు. ప్రజా రవాణాకు ఈనెల 12 నుంచి ట్రూజెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 14 నుంచి ప్రారంభంకానున్న మహా పుష్కరాలకు టర్బో మెగా ఎయిర్‌వేస్ ప్రత్యేక సర్వీసులను నడపనుందని టర్బో మెగా డైరెక్టర్ రామ్‌చరణ్ తెలిపారు. షిర్డీ, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖకు ట్రూజెట్ సర్వీసులను నడుపుతారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఎయిర్‌క్రాఫ్ట్‌లో డిస్కౌంట్‌తో విద్యార్థుల కోసం 10 సీట్లు కేటాయిస్తామని, అలాగే సీనియర్ సిటిజన్స్‌కు 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని చరణ్ చెప్పారు.
Next Story