కొంచెం ఇష్టం, కొంచెం కష్టం... మోడీ, షరీఫ్ భేటీ
భారత్ ప్రధాని నరేంద్రమోడి, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య సమావేశం కొంచెం ఇష్టం… కొంచెం కష్టం అన్నట్టు జరిగింది. ఇరు దేశాలు తీవ్రవాదం విషయంలో ఒకరినొకరు తప్పు పట్టారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలో ఉన్న మోదీ, షరీఫ్‌లు ఒకరికొకరు సమావేశమయ్యే అవకాశం కలిగింది. నిజానికి చాలాకాలంగా వీరిద్దరూ పలకరించుకోలేదు. ఇందుకు కారణం పాక్ భూభాగంలో తీవ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తుందన్నదే. ఇదే విషయాన్ని నవాజ్ షరీఫ్ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని, పాక్‌తో […]
BY sarvi10 July 2015 4:25 AM GMT
X
sarvi Updated On: 10 July 2015 4:33 AM GMT
భారత్ ప్రధాని నరేంద్రమోడి, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య సమావేశం కొంచెం ఇష్టం… కొంచెం కష్టం అన్నట్టు జరిగింది. ఇరు దేశాలు తీవ్రవాదం విషయంలో ఒకరినొకరు తప్పు పట్టారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యాలో ఉన్న మోదీ, షరీఫ్‌లు ఒకరికొకరు సమావేశమయ్యే అవకాశం కలిగింది. నిజానికి చాలాకాలంగా వీరిద్దరూ పలకరించుకోలేదు. ఇందుకు కారణం పాక్ భూభాగంలో తీవ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తుందన్నదే. ఇదే విషయాన్ని నవాజ్ షరీఫ్ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని, పాక్‌తో టెర్రరిస్టులకు భారత్ మద్దతుందని షరీఫ్ ఆరోపించారు. అయితే మొత్తానికి తమ దేశంలో తీవ్రవాద స్థావరాల్ని అంతమొందించడానికి ప్రయత్నిస్తామని షరీఫ్ చెప్పగా టెర్రరిస్టులకు తమ మద్దతుందన్నట్టు మీ దగ్గర ఆధారాలేమైనా ఉంటే తమకు అందజేయాలని మోడి డిమాండు చేశారు. ముంబాయి పేలుళ్ల సూత్రధారులపై చర్యలకు పాకిస్తాన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఈ సందర్భంగా భారత్ ఆరోపించింది. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న లఖ్వీ వ్యవహారాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వద్ద ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకుంటున్నామని షరీఫ్ చెప్పగా… సమగ్ర చర్యలు అవసరమని మోదీ సమాధానం ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణానికి కృషి చేయాలని మోదీ, షరీఫ్ నిర్ణయించారు. రష్యా నగరం యుఫాలో ఇద్దరు నేతలు శిఖరాగ్ర చర్చలు జరిపారు. మీడియా రష్యాన్ హ్యాండ్ షేక్ అని పిలుస్తున్న ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అనేక ద్వైపాక్షిక అంశాల్లో పాక్ వైఖరిని మోదీ సూటిగానే ప్రస్తావించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పాక్, చైనా ఆర్థిక కారిడార్‌పై మోదీ అభ్యంతరం చెప్పగా దానికి ఇంకా సమయం ఉందని షరీఫ్ సమాధానం ఇచ్చారు. పాక్ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వెనుక భారత్ హస్తముందన్న షరీఫ్ ఆరోపణను మోదీ తోసిపుచ్చారు. సాక్ష్యాధారాలు సమర్పించాలని మోదీ డిమాండ్ చేశారు. 2016లో పాకిస్థాన్‌లో జరిగే సార్క్ శిఖరాగ్ర సమావేశానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్ ఆహ్వానించగా తాను తప్పనిసరిగా వస్తానని మోడీ హామీ ఇచ్చారు.
Next Story