జర నవ్వండి ప్లీజ్ 139
ఇల్లు కట్టి చూడు రామమూర్తి: ఇల్లెలా కట్టావ్? వెంకటరావు: అప్పుచేసి… రామమూర్తి: మరి అప్పు ఎలా తీర్చావ్? వెంకటరావు: ఇంటిని అమ్మేసి! ————————————- విచారం రమణ: నీ జుట్టు ఊడిపోవడానికి కారణం? గిరి: విచారం రమణ: దేని గురించి? గిరి: జుట్టు ఊడిపోవడం గురించి… ————————————- కొత్తషి”కారు” కృష్ణ: వాడేంట్రా! డ్రైవింగ్ సీటు నుంచి దిగి భార్య దిగేందుకు వీలుగా డోరు తీస్తున్నాడు? రాము: కారన్నా కొత్తదయి ఉండాలి.. లేదా భార్యన్నా కొత్తదయి ఉండాలి! ————————————- బొట్టు…గుర్తు […]
ఇల్లు కట్టి చూడు
రామమూర్తి: ఇల్లెలా కట్టావ్?
వెంకటరావు: అప్పుచేసి…
రామమూర్తి: మరి అప్పు ఎలా తీర్చావ్?
వెంకటరావు: ఇంటిని అమ్మేసి!
————————————-
విచారం
రమణ: నీ జుట్టు ఊడిపోవడానికి కారణం?
గిరి: విచారం
రమణ: దేని గురించి?
గిరి: జుట్టు ఊడిపోవడం గురించి…
————————————-
కొత్తషి”కారు”
కృష్ణ: వాడేంట్రా! డ్రైవింగ్ సీటు నుంచి దిగి భార్య దిగేందుకు వీలుగా డోరు తీస్తున్నాడు?
రాము: కారన్నా కొత్తదయి ఉండాలి.. లేదా భార్యన్నా కొత్తదయి ఉండాలి!
————————————-
బొట్టు…గుర్తు
మధు: ఒరేయ్ శీనూ… గుడిలో భక్తులకు పూజారి బొట్టు ఎందుకురా పెడతాడు?
ఉదయ్: ప్రసాదం కోసం మళ్లీ మళ్లీ వచ్చి అడగకుండా… గుర్తు పెట్టుకోవడానికి వీలుగా బొట్లు పెడతార్రా!