చంద్రబాబుకు సుధాకర్‌రెడ్డి చురకలు !
ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చురకలంటించారు. ఓటుకు నోటు కేసులో బయటికి వచ్చిన ఆడియో టేపుల్లో గొంతు నీదో కాదో చెప్పాలని బాబును డిమాండ్ చేశారు. నీది కానప్పడు స్వరపరీక్షకు హాజరవ్వాలని సూచించారు. ఓటుకు నోటుకేసు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిందని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థంగా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తాము చెప్పినట్లు వినడం […]
BY Pragnadhar Reddy10 July 2015 3:07 AM IST
X
Pragnadhar Reddy Updated On: 10 July 2015 6:27 AM IST
ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చురకలంటించారు. ఓటుకు నోటు కేసులో బయటికి వచ్చిన ఆడియో టేపుల్లో గొంతు నీదో కాదో చెప్పాలని బాబును డిమాండ్ చేశారు. నీది కానప్పడు స్వరపరీక్షకు హాజరవ్వాలని సూచించారు. ఓటుకు నోటుకేసు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిందని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థంగా అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తాము చెప్పినట్లు వినడం లేదని గవర్నర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని టీడీపీ నేతలకూ చురకలంటించారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే ఇలాంటి ధోరణి మానుకోవాలని హితవుపలికారు. అలాగే వ్యాపం కేసులో సుప్రీం కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడానికి ఆయన స్వాగతించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్‌ను బర్తరఫ్ చేసి వెంటనే అరెస్టు చేయాలని, సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల20న దేశవ్యాప్తంగా 500 చోట్ల సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Next Story