బీహార్ పరిషత్ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి
బీహార్‌లో జరిగిన విధాన పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి విజయఢంకా మోగించింది. మొత్తం 24 స్థానాలకు గాను 12 సాధించి విపక్ష నేతలను ఖంగు తినిపించింది. ఇంకో విశేషమేమిటంటే… ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలకు మరో మూడు స్థానాలు లభించాయి. ఎన్నికలకు కొంచెం ముందు జట్టుగా ఏర్పడి కలిసికట్టుగా పోటీ చేసిన రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యు), కాంగ్రెస్‌లు తమకు జరిగిన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాయి. జనతా పరివార్ పేరుతో ఒక్కటై […]
బీహార్‌లో జరిగిన విధాన పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి విజయఢంకా మోగించింది. మొత్తం 24 స్థానాలకు గాను 12 సాధించి విపక్ష నేతలను ఖంగు తినిపించింది. ఇంకో విశేషమేమిటంటే… ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలకు మరో మూడు స్థానాలు లభించాయి. ఎన్నికలకు కొంచెం ముందు జట్టుగా ఏర్పడి కలిసికట్టుగా పోటీ చేసిన రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యు), కాంగ్రెస్‌లు తమకు జరిగిన ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాయి. జనతా పరివార్ పేరుతో ఒక్కటై బీజేపీని కకావికలం చేయాలన్న వారి ఆశలపై ఓటర్లు నీళ్ళు జల్లారు. జనతాదళ్-యు ఐదు స్థానాలు, రాష్ట్రీయ జనతాదళ్ మూడు, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఇలా దెబ్బతినడం జనతా పరివారానికి ఇలా పరాభవం ఎదురవడం నిజంగా పెద్ద దెబ్బే. అయితే వచ్చే విధానసభ ఎన్నికల్లో తమ పరివారే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని నితీష్, లాలూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతాపార్టీ దూకుడు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయ కేతనం ఎగురేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.