ముగిసిన ఏసీబీ రిమాండ్... చర్లపల్లి జైలుకు సండ్ర
ఓటుకు నోటు కేసులో అరెస్టయిన సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కస్టడీ ముగిసిన తర్వాత అధికారులు సండ్రను కోర్టులో హాజరుపరచగా ఆయనకు 21 వరకు రిమాండు విధించారు. అనంతరం ఆయనను చర్లపల్లి కోర్టుకు తరలించారు. ఏసీబీ రిమాండులో సండ్రపై రెండో రోజు కూడా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ ఏ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడారు? ఎవరిని ప్రలోభపెట్టారు? ఇలా ఆయనకు ఊపిరాడకుండా చేశారని తెలిసింది. ఏసీబీ అధికారులు రెండో రోజు ఏసీబీ అధికారుల విచారణకు సండ్ర […]
ఓటుకు నోటు కేసులో అరెస్టయిన సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కస్టడీ ముగిసిన తర్వాత అధికారులు సండ్రను కోర్టులో హాజరుపరచగా ఆయనకు 21 వరకు రిమాండు విధించారు. అనంతరం ఆయనను చర్లపల్లి కోర్టుకు తరలించారు. ఏసీబీ రిమాండులో సండ్రపై రెండో రోజు కూడా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ ఏ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడారు? ఎవరిని ప్రలోభపెట్టారు? ఇలా ఆయనకు ఊపిరాడకుండా చేశారని తెలిసింది. ఏసీబీ అధికారులు రెండో రోజు ఏసీబీ అధికారుల విచారణకు సండ్ర వెంకటవీరయ్య సహకరిస్తున్నారని ఆయన న్యాయవాది సుధీర్ చెప్పారు. కాగా సండ్ర పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారం నాటికి వాయిదా వేసింది.