Telugu Global
Others

కన్ను కొట్టాడని స్కూల్లోనే బాలుడి హత్య!

తనతో చదువుకుంటున్న ఓ అమ్మాయికి కన్ను కొట్టాడన్న కోపంతో ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలే కొట్టి చంపేశారు ఆ అబ్బాయిని. ఇంతకీ అతని వయస్సెంతో తెలుసా? పదకొండేళ్ళు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా సంగమన్నార్‌లో జరిగింది. ఏడో తరగతి చదువుతున్న కిరణ్ గోరక్ష్‌ సోనవానే అనే బాలుడు రాజాపూర్‌ న్యూటన్‌ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్లో ఓ బాలికకు కన్ను కొట్టాడని ఆగ్రహించిన కొంతమంది పిల్లలు కిరణ్‌ తలను బెంచీకేసి కొట్టారు. ఇంకా కోపం […]

తనతో చదువుకుంటున్న ఓ అమ్మాయికి కన్ను కొట్టాడన్న కోపంతో ఆ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలే కొట్టి చంపేశారు ఆ అబ్బాయిని. ఇంతకీ అతని వయస్సెంతో తెలుసా? పదకొండేళ్ళు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా సంగమన్నార్‌లో జరిగింది. ఏడో తరగతి చదువుతున్న కిరణ్ గోరక్ష్‌ సోనవానే అనే బాలుడు రాజాపూర్‌ న్యూటన్‌ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్లో ఓ బాలికకు కన్ను కొట్టాడని ఆగ్రహించిన కొంతమంది పిల్లలు కిరణ్‌ తలను బెంచీకేసి కొట్టారు. ఇంకా కోపం తీరని వారు అక్కడున్న చెట్టుకేసి మరోసారి తలను కొట్టారు. తీవ్రగాయాలతో రక్తమోడుతున్న ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా నాలుగు రోజుల తర్వాత చనిపోయాడు. గతనెల 26న జరిగిన ఈ సంఘటనలో ప్రధానంగా పాల్గొన్న ముగ్గురిపై 302 సెక్షన్‌ ప్రకారం కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. మొదట ఈ కేసును ప్రమాదవశాత్తూ మరణించినట్టుగా నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం 302 సెక్షన్‌ కింద ఎఫ్‌.ఐ.ఆర్‌. ఫైల్‌ చేశారు. స్కూల్లో ఆడపిల్లలందరినీ తన కొడుకు చెల్లెళ్ళలా భావిస్తున్నట్టు తనకు చెప్పేవాడని కిరణ్‌ తల్లి తెలిపింది. మరేదో కారణంతో తన కొడుకును చంపేసి ప్రతీకారం తీర్చుకున్నారని ఆ తల్లి ఆరోపిస్తోంది.
First Published:  8 July 2015 6:38 PM IST
Next Story