Telugu Global
Others

రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్‌ బ్యాంకులపై దాడులు 

 రాష్ట్రవ్యాప్తంగా 132 బ్లడ్ బ్యాంకులపై డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లు  ఏకకాలంలో దాడి చేసి నిబంధనలు పాటించని 109 బ్లడ్ బ్యాంకులకు నోటీసులిచ్చారు. రక్తనిధి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతోపాటు బ్లడ్ బ్యాంకుల్లో రక్తదాతలు, స్వీకర్తల వివరాలను నమోదు చేయడం లేదని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ధర కంటే అధిక ధరకు రక్తాన్ని అమ్మడం,  సరైన టెక్నీషియన్లను నియమించక పోవడం, సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి శుద్ధి చేసిన తర్వాత నిల్వ చేయడంతోపాటు బయో మెడికల్‌ వేస్టేజ్‌ నిర్వహణలో కూడా […]

రాష్ట్రవ్యాప్తంగా 132 బ్లడ్ బ్యాంకులపై డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్లు ఏకకాలంలో దాడి చేసి నిబంధనలు పాటించని 109 బ్లడ్ బ్యాంకులకు నోటీసులిచ్చారు. రక్తనిధి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతోపాటు బ్లడ్ బ్యాంకుల్లో రక్తదాతలు, స్వీకర్తల వివరాలను నమోదు చేయడం లేదని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ధర కంటే అధిక ధరకు రక్తాన్ని అమ్మడం, సరైన టెక్నీషియన్లను నియమించక పోవడం, సేకరించిన రక్తాన్ని గ్రూపులుగా విభజించి శుద్ధి చేసిన తర్వాత నిల్వ చేయడంతోపాటు బయో మెడికల్‌ వేస్టేజ్‌ నిర్వహణలో కూడా బ్లడ్ బ్యాంకులు విఫలమయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నోటీసులు అందుకున్న బ్లడ్ బ్యాంకులు వారంలోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో లైసెన్స్‌ రద్దు చేసి కేంద్రాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రితోపాటు, ఎన్టీఆర్‌ ట్రస్టు, చిరంజీవి బ్లడ్ బ్యాంకులు కూడా నోటీసులు అందుకున్న బ్లడ్ బ్యాంకుల జాబితాలో ఉన్నాయి.
First Published:  8 July 2015 6:43 PM IST
Next Story