నాకు యోగా రాదు... అందరూ చేస్తుంటే చూశా: పుతిన్
యోగా చేయడం తనకు రాదని చెప్పి ప్రధానిని ఆశ్చర్య పరిచారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. యోగా చేయడం చాలా కష్టంగా అనిపించడంతో చేయలేక అందరూ చేస్తుంటే చూస్తూ ఉండి పోయానని ఆయన మోడీతో చమత్కరించారు. మార్సల్ ఆర్ట్సలో నిపుణుడైన పుతిన్ యోగా చేయడం చాలా కష్టమనడంతో ప్రధాని ఆశ్చర్య పోయారు. రష్యా అధ్యక్షుడు యోగా చేయలేక పోయినా, దేశవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధాని అన్నారు. ఎనిమిది […]
BY sarvi9 July 2015 8:47 AM IST
X
sarvi Updated On: 9 July 2015 8:47 AM IST
యోగా చేయడం తనకు రాదని చెప్పి ప్రధానిని ఆశ్చర్య పరిచారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. యోగా చేయడం చాలా కష్టంగా అనిపించడంతో చేయలేక అందరూ చేస్తుంటే చూస్తూ ఉండి పోయానని ఆయన మోడీతో చమత్కరించారు. మార్సల్ ఆర్ట్సలో నిపుణుడైన పుతిన్ యోగా చేయడం చాలా కష్టమనడంతో ప్రధాని ఆశ్చర్య పోయారు. రష్యా అధ్యక్షుడు యోగా చేయలేక పోయినా, దేశవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధాని అన్నారు. ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం రష్యా చేరుకున్న ప్రధాని ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎన్‌సీఓ) లో భారత్‌కు పూర్తి స్థాయి సభ్యత్వం దక్కేందుకు కృషి చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. వీరిరువురూ ద్వైపాక్షిక పౌర అణుశక్తి రంగంలో సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. భారత్‌లోని రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో సహకారంతో పాటు భారత్‌లోని పలు రంగాల అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు రష్యా అధ్యక్షుడు అంగీకరించారు.
అనంతరం ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్‌పై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకోవడంపై ప్రధాని నిరసన వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా చైనా నిర్మిస్తున్న ఆర్థిక కారిడార్‌పై కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రధాని, ఏడాదిలో మనం ఐదు సార్లు కలుసుకోవడం రెండు దేశాల మధ్య అనుబంధాన్ని చాటుతోందన్నారని ఆయనతో అన్నట్టు భారత విదేశాంగ కార్యదర్శి స్వరూప్ ట్వీట్ చేశారు. ఎన్‌సీఓ సదస్సు సందర్భంగా ఈ నెల 10వ తేదీన భారత, పాక్ ప్రధానులు ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం. అయితే, ఆ సమావేశ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
ఐదు ఒప్పందాలపై కజక్‌తో సంతకాలు
భారత్, కజకిస్తాన్‌లు బుధవారం ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిల్లో ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించే రక్షణ ఒప్పందం, యురేనియం సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న కాంట్రాక్టు వున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కజక్ అధ్యక్షుడు నూరుసుల్తాన్ నజర్ బయేవ్‌లు సమగ్రంగా చర్చలు జరిపిన అనంతరం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రాంతీయ శాంతి, సుస్థిరత, ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలతో సహా పలు అంతర్జాతీయ సమస్యలపై తామిరువురం చర్చించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. నజర్‌బయేవ్‌తో కలిసి ఆయన పత్రికాగోష్టిలో పాల్గొన్నారు. రక్షణ, భద్రతా సహకారానికి సంబంధించిన ఒప్పందం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన పార్శ్వమని మోడీ పేర్కొన్నారు. భారతదేశ ఇంధన అవసరాలను తీర్చేందుకుగాను యురేనియంను దీర్ఘకాలికంగా సరఫరా చేసే కాంట్రాక్టుపై సంతకాలు చేయడాన్ని మోడీ స్వాగతించారు.
Next Story