Telugu Global
Others

ఈనెల 29 నుంచి తెలంగాణ మెడికల్‌ కౌన్సెలింగ్ 

తెలంగాణలో ఈనెల 29 నుంచి ఆగస్ట్‌ 3 వరకు ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ యూనివర్శిటీ వీసీ రవిరాజు హైదరాబాద్‌లో ప్రకటించారు. హైదరాబాద్‌, వరంగల్‌, విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ వర్శిటీలో కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, కౌన్సెలింగ్‌కు జేఎన్‌టీయూ సాంకేతిక సహకారం తీసుకుంటామని  ఆయన చెప్పారు. ఆర్మీ, ఎన్‌సీసీ అభ్యర్ధులకు ఆగస్ట్‌ 4,5 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏపీలో ఎంసెట్ మెడికల్‌ కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.  

First Published:  8 July 2015 6:42 PM IST
Next Story