Telugu Global
Others

కేసీఆర్ కుల‌స‌మీక‌ర‌ణ‌ల వ్యూహం..?

మున్నూరు కాపుల ఓట్ల‌కు గాలం  .. అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌ను టీఆర్ఎస్ అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించ‌డ‌మేకాక ఆయ‌న కోసం పార్టీలోనూ ఓ పెద్ద పొజిష‌న్‌ను సిద్ధం చేస్తున్నారు. ఒక‌వేళ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగితే డీఎస్‌కు త‌ప్ప‌నిస‌రిగా స్థానం ఉంటుంద‌ని వినిపిస్తోంది. నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో డీఎస్ వ‌రుస‌గా మూడుసార్లు ఓట‌మిపాల‌య్యారు. అసెంబ్లీ స్థానంలో కూడా గెల‌వ‌లేని డీఎస్‌కు అంత ప్రాధాన్య‌త ఎందుక‌ని టీఆర్ఎస్‌లో ద్వితీయ […]

కేసీఆర్ కుల‌స‌మీక‌ర‌ణ‌ల వ్యూహం..?
X
మున్నూరు కాపుల ఓట్ల‌కు గాలం ..
అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌ను టీఆర్ఎస్ అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించ‌డ‌మేకాక ఆయ‌న కోసం పార్టీలోనూ ఓ పెద్ద పొజిష‌న్‌ను సిద్ధం చేస్తున్నారు. ఒక‌వేళ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగితే డీఎస్‌కు త‌ప్ప‌నిస‌రిగా స్థానం ఉంటుంద‌ని వినిపిస్తోంది. నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో డీఎస్ వ‌రుస‌గా మూడుసార్లు ఓట‌మిపాల‌య్యారు. అసెంబ్లీ స్థానంలో కూడా గెల‌వ‌లేని డీఎస్‌కు అంత ప్రాధాన్య‌త ఎందుక‌ని టీఆర్ఎస్‌లో ద్వితీయ శ్రేణి నాయ‌కులు గుర్రు మంటున్నా కేసీఆర్ వ్యూహాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ‌లో గ‌ణ‌నీయంగా ఉన్న‌ మున్నూరు కాపుల‌ను టీఆర్ఎస్‌కు ద‌గ్గ‌ర చేయ‌డానికి డీఎస్ చేరిక క‌చ్చితంగా దోహ‌ద‌ప‌డుతుంది. తెలంగాణ‌లో మున్నూరుకాపు, గౌడ‌, యాద‌వ సామాజిక‌వ‌ర్గాలు మూడు బ‌ల‌మైన‌వి. ఒక్కో సామాజిక వ‌ర్గంలో 9శాతం ఓట్లు ఉంటాయి. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా టీఆర్ఎస్ విజ‌యం సాధించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ సెంటిమెంట్ ప‌నిచేయ‌దు. అందుక‌ని పార్టీని పునాది స్థాయి నుంచి బ‌లోపేతం చేయాల‌నేది కేసీఆర్ ల‌క్ష్యం. అందుకోసమే అన్ని సామాజిక వ‌ర్గాల నుంచి బ‌ల‌మైన నాయ‌కుల‌ను టీఆర్ఎస్‌లోకి స‌మీక‌రిస్తున్నారు. డీఎస్‌ను చేర్చుకోవ‌డం ద్వారా కేవ‌లం మున్నూరు కాపుల‌లోనే కాక మొత్తంగా బీసీ ఓటర్లంద‌రికీ టీఆర్ఎస్ సానుకూల‌మైన పార్టీ అని సంకేతాన్నిచ్చిన‌ట్ల‌యింద‌ని ప‌రిశీల‌కులంటున్నారు. టీఆర్ఎస్ అంటే అగ్ర‌కులాల పార్టీ అన్న ముద్ర చెరిపివేయ‌డానికి కూడా ఇది ప‌నికి వ‌స్తుంది.
First Published:  9 July 2015 6:40 AM IST
Next Story