Telugu Global
Others

కేంద్రాన్ని నిలదీస్తే పనులవ్వవు: కంభంపాటి

కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి తప్ప నిలదీయాలనుకోవడం లక్ష్యం కాకూడదని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు అన్నారు. నిధులు విడుదల చేయించుకోవడమే ఎన్డీయే భాగస్వామిగా తమ లక్ష్యమని, అంతేతప్ప నిల్చోబెట్టి అడగటం పద్ధతి కాదని అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని, అందుకు కొన్ని సాంకేతిక సమస్యలు, ఒత్తిళ్లు ఉన్నాయని… కొంత ఆలస్యమైనా హోదా రావడం తథ్యమని, దీనిని వివాదం చేసుకోవడం మంచిది కాదని చెప్పారు. […]

కేంద్రాన్ని నిలదీస్తే పనులవ్వవు: కంభంపాటి
X
కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి తప్ప నిలదీయాలనుకోవడం లక్ష్యం కాకూడదని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు అన్నారు. నిధులు విడుదల చేయించుకోవడమే ఎన్డీయే భాగస్వామిగా తమ లక్ష్యమని, అంతేతప్ప నిల్చోబెట్టి అడగటం పద్ధతి కాదని అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని, అందుకు కొన్ని సాంకేతిక సమస్యలు, ఒత్తిళ్లు ఉన్నాయని… కొంత ఆలస్యమైనా హోదా రావడం తథ్యమని, దీనిని వివాదం చేసుకోవడం మంచిది కాదని చెప్పారు. ఏడాదిలో ఎన్నో సమస్యలను అధిగమించామని, ఏ పని కావాలన్నా సహనం, ఓపిక అవసరమని అభిప్రాయపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ మాటలను వివాదం చేయాల్సిన పనిలేదని, ఆయన ఇప్పటికీ తమతోనే ఉన్నాడని చెప్పారు. ఏడాదిలో తాము చేసిన పనులన్నీ బహుశా పవన్‌కు తెలియకపోవచ్చునని అన్నారు. ఆయనతోసహా ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటామని, ఆయన కలిసి వస్తే పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. సగటున ప్రతి 4 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రులను కలిశామని తెలిపారు.
First Published:  9 July 2015 3:08 AM IST
Next Story