Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 138

“మీ అపార్ట్‌మెంట్‌ బ్రహ్మాండంగా ఉందండీ. మీ ప్లాటు, వెంటిలేషన్‌, ప్లజెంట్‌ అట్మాస్పియర్‌ అంతా అద్భుతం”. “రేపే ఖాళీ చేస్తున్నామండీ” “అరే ఏమైంది?” “మా పైన ఫ్లాట్లో ఈ రోజునించే ఒకమ్మాయి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది”. —————————————————————————————————- తోటమాలి: అమ్మగారూ! పొగాకు మొక్క పూలు పూచింది. యజమానురాలు : అలాగా! ఐతే సిగరెట్లు పండడానికి ముందు ఎంతకాలం ఉంటాయి పూలు? —————————————————————————————————- “ఈరోజు సాయంత్రం వర్షం రాదని ఖచ్చితంగా చెప్పగలను” “అంత నమ్మకంగా చెబుతున్నారంటే మీది చాలా పాజిటివ్‌ […]

“మీ అపార్ట్‌మెంట్‌ బ్రహ్మాండంగా ఉందండీ. మీ ప్లాటు, వెంటిలేషన్‌, ప్లజెంట్‌ అట్మాస్పియర్‌ అంతా అద్భుతం”.
“రేపే ఖాళీ చేస్తున్నామండీ”
“అరే ఏమైంది?”
“మా పైన ఫ్లాట్లో ఈ రోజునించే ఒకమ్మాయి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది”.
—————————————————————————————————-
తోటమాలి: అమ్మగారూ! పొగాకు మొక్క పూలు పూచింది.
యజమానురాలు : అలాగా! ఐతే సిగరెట్లు పండడానికి ముందు ఎంతకాలం ఉంటాయి పూలు?
—————————————————————————————————-
“ఈరోజు సాయంత్రం వర్షం రాదని ఖచ్చితంగా చెప్పగలను”
“అంత నమ్మకంగా చెబుతున్నారంటే మీది చాలా పాజిటివ్‌ దృక్పథమనుకుంటాను”.
“ఔను. నిన్ననే నేను నా గొడుగును పోగొట్టుకున్నాను. ఆకాశంలో మేఘాలు అస్సలు లేవు. పైగా ఈ సాయంత్రం మా ఆవిడ షాపింగ్‌ చెయ్యబోతోంది!”
—————————————————————————————————-
ఇరవై సంవత్సరాలనుంచీ వీరయ్య దగ్గర ఆ గొడుగుంది”.
“గొప్ప సంగతే!”
“గొప్ప సంగతే కాదనను కానీ ఇకనైనా గొడుగు నాకు తిరిగి ఇచ్చేస్తే బావుంటుందనుకుంటాను”.

First Published:  8 July 2015 6:33 PM IST
Next Story