వరంగల్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూలు
హైదరాబాద్ పబ్లిక్ స్కూలు తన శాఖను వరంగల్‌లో కూడా ప్రారంభిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈస్కూల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ను +2 వరకూ ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారని ఆయన చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్న ఈ స్కూలు భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శంఖుస్థాపన చేస్తారని మంత్రి చెప్పారు. విద్యాభవనాల నిర్మాణం పూర్తయ్యే వరకూ ప్రైవేట్ భవనాల్లో తరగతులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ విద్యా సంవత్సరానికి మాత్రం […]
BY sarvi8 July 2015 6:39 PM IST
sarvi Updated On: 9 July 2015 6:17 AM IST
హైదరాబాద్ పబ్లిక్ స్కూలు తన శాఖను వరంగల్‌లో కూడా ప్రారంభిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఈస్కూల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ను +2 వరకూ ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారని ఆయన చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్న ఈ స్కూలు భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శంఖుస్థాపన చేస్తారని మంత్రి చెప్పారు. విద్యాభవనాల నిర్మాణం పూర్తయ్యే వరకూ ప్రైవేట్ భవనాల్లో తరగతులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ విద్యా సంవత్సరానికి మాత్రం 1 నుంచి 5 వ తరగతి వరకే విద్యార్ధులకు అడ్మిషన్లు జరుగుతాయని, వచ్చే ఏడాది నుంచి +2 వరకూ అడ్మిషన్లుంటాయని కడియం చెప్పారు. జాతీయస్థాయిలో నిర్వహించే ఐఐటీ-జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్ధులు అర్హత సాధించేందుకు తర్ఫీదునివ్వడానికే హైదరాబాద్ పబ్లిక్ స్కూలు వరంగల్‌లో తన శాఖను ప్రారంభిస్తోందని, అందుకోసం హెచ్‌పీసీకి ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయించిందని ఆయన వెల్లడించారు.
Next Story