Telugu Global
Others

టీఎస్‌పీఎస్సీ అభ్యర్ధులకు  వయో పరిమితిలో  ఐదేండ్ల సడలింపు 

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అభ్యర్ధులకు వయోపరిమితిలో పదేండ్ల సడలింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘం తోసిపుచ్చింది. 2011,2012 సంవత్సరాల్లో గ్రూప్‌ పరీక్షల నోటిఫికేషన్‌ వెలువడినందువల్ల అభ్యర్ధులకు ఐదేళ్ల సడలింపు ఇస్తే సరిపోతుందని ఉపసంఘం అభిప్రాయపడింది.  టీఎస్‌పీఎస్పీ పరీక్షల విధివిధానాలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ […]

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అభ్యర్ధులకు వయోపరిమితిలో పదేండ్ల సడలింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘం తోసిపుచ్చింది. 2011,2012 సంవత్సరాల్లో గ్రూప్‌ పరీక్షల నోటిఫికేషన్‌ వెలువడినందువల్ల అభ్యర్ధులకు ఐదేళ్ల సడలింపు ఇస్తే సరిపోతుందని ఉపసంఘం అభిప్రాయపడింది. టీఎస్‌పీఎస్పీ పరీక్షల విధివిధానాలపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ పరీక్షలను నాలుగు విభాగాలుగా విభజించారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4తో పాటు కొత్తగా గ్రూప్‌-3 పరీక్షలను కూడా ప్రభుత్వం నిర్వహించనుంది. గతంలో మాదిరిగానే గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ లను నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. గ్రూప్‌-2 ( ఎగ్జిక్యూటివ్‌)పోస్టులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్ధులకు రాత పరీక్షలోనూ, మౌఖిక పరీక్షలోనూ వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కొత్తగా సృష్టించిన గ్రూప్‌-3 కేటగిరీ (నాన్‌ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గ్రూప్‌ -4 పరీక్షల ద్వారా జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి పలు కేటగిరి పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

First Published:  8 July 2015 1:06 PM GMT
Next Story