చీకటి రాజ్యం సగం పూర్తయింది
చీకటిరాజ్యం అనే సినిమాను ఈమధ్యే ప్రారంభించాడు కమల్ హాసన్. అప్పుడే సినిమా షూటింగ్ ను సగానికి సగం పూర్తిచేశాడు. రాజేష్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, మధుషాలినీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటి పోస్టర్ లో కమల్ హాసన్ లిప్ కిస్సు పెట్టింది కూడా మధుషాలినీకే. సినిమా ప్రారంభమయ్యాక మ్యాగ్జిమమ్ షూటింగ్ ను హైదరాబాద్ లోనే కొనసాగించారు. టైటిల్ కు తగ్గట్టు నైట్ ఎఫెక్ట్ లో ఎక్కువ సన్నివేశాలు తీశారు. అలా హైదరాబాద్ లో కీలక […]
BY admin9 July 2015 2:30 AM IST
X
admin Updated On: 9 July 2015 6:23 AM IST
చీకటిరాజ్యం అనే సినిమాను ఈమధ్యే ప్రారంభించాడు కమల్ హాసన్. అప్పుడే సినిమా షూటింగ్ ను సగానికి సగం పూర్తిచేశాడు. రాజేష్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, మధుషాలినీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటి పోస్టర్ లో కమల్ హాసన్ లిప్ కిస్సు పెట్టింది కూడా మధుషాలినీకే. సినిమా ప్రారంభమయ్యాక మ్యాగ్జిమమ్ షూటింగ్ ను హైదరాబాద్ లోనే కొనసాగించారు. టైటిల్ కు తగ్గట్టు నైట్ ఎఫెక్ట్ లో ఎక్కువ సన్నివేశాలు తీశారు. అలా హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత, లొకేషన్ చెన్నైకి మారింది. అక్కడ కూడా ఏకథాటిగా షూటింగ్ జరిపి మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అలా టోటల్ టీం అంతా చీకటి రాజ్యం పనిమీదే ఉండడంతో సినిమా చూస్తుండగానే సగం షూటింగ్ పూర్తిచేసుకుంది. పైగా స్క్రీన్ ప్లే.. సీన్ టు సీన్ సిద్ధంగా ఉండడంతో షూటింగ్ మరింత ఈజీ అయిపోయింది. తాజాగా ఈ సెట్స్ లోకి ప్రకాష్ రాజ్ కూడా వచ్చి చేశాడు. ఇన్ని రోజులు సేవ్ టైగర్ కార్యక్రమంలో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్.. ఇప్పుడు కమల్ తో కలిశాడు. ఇద్దరూ కలిసి కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. మరో 20 రోజులు ఏకథాటిగా షూటింగ్ చేసి టాకీపార్ట్ పూర్తిచేయాలనుకుంటున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ చీకటిరాజ్యంను నిర్మిస్తున్నాడు.
Next Story