Telugu Global
Others

సైన్యాన్ని తగ్గించనున్న అమెరికా 

అగ్రరాజ్యం అమెరికా తన సేనల సంఖ్యను తగ్గించుకోనుందా? అన్న ప్రశ్నకు ఔననే సమాధానమిస్తున్నారు ఆ శాఖ ఉన్నతాధికారి. అమెరికన్‌ ఆర్మీలో పని చేస్తున్న 40 వేల మంది సైనికులను, వారి కోసం పని చేస్తున్న మరో 17 వేల మంది పౌరులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనిపై త్వరలోనే అమెరికన్‌ ఆర్మీ అధికారిక ప్రకటన చేయనుందని యూఎస్‌ఎ టుడే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 20 శతాబ్దంలో యుద్ధకాంక్షతో రగిలిపోతూ ప్రపంచానికి పెద్దన్న పాత్ర […]

అగ్రరాజ్యం అమెరికా తన సేనల సంఖ్యను తగ్గించుకోనుందా? అన్న ప్రశ్నకు ఔననే సమాధానమిస్తున్నారు ఆ శాఖ ఉన్నతాధికారి. అమెరికన్‌ ఆర్మీలో పని చేస్తున్న 40 వేల మంది సైనికులను, వారి కోసం పని చేస్తున్న మరో 17 వేల మంది పౌరులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనిపై త్వరలోనే అమెరికన్‌ ఆర్మీ అధికారిక ప్రకటన చేయనుందని యూఎస్‌ఎ టుడే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 20 శతాబ్దంలో యుద్ధకాంక్షతో రగిలిపోతూ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా దేశంలోనూ, విదేశాల్లోనూ సైన్యంపై విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తోంది.దీన్ని అరికట్టేందుకు వచ్చే రెండేళ్లలో 40 వేల మంది సైనికులను తొలగించాలని అమెరికా రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించడానికి ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ప్రణాళికను అనుసరిస్తే అమెరికా ఆర్మీలో 4,50,000 మంది సైనికులే ఉంటారని, అంతకంటే తక్కువ సైన్యముంటే యుద్ధాలను గెలవలేమని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఆఫ్ఘన్‌, ఇరాక్ దేశాలతో యుద్ధ సమయంలో అమెరికాకు 5,70,000 మంది సైన్యంలో ఉన్నారు.
First Published:  8 July 2015 6:44 PM IST
Next Story