Telugu Global
Others

తేనెటీగల దెబ్బకు నిలిచిన విమానం

తేనెటీగల ధాటికి  పెద్ద విమానం కూడా విలవిలలాడి పోయింది. గంటకు పైగా విమానాశ్రయంలోనే నిలిచి పోయింది. వీటి బారి నుంచి ప్రయాణీకులను కాపాడేందుకు విమానాశ్రయ సిబ్బంది రెండు అంబులెన్స్‌లు రప్పించారు. ఈ ఘటన రష్యాలోని నుకోవ్‌ ఎయిర్‌పోర్టులో జరిగింది. రోషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ -319 మాస్కో నుంచి మంగళవారం ఉదయం నుకోవ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరుతుండగా, వందలాది తేనెటీగలు విమానంపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు విమాన ప్రయాణీకులు […]

తేనెటీగల ధాటికి పెద్ద విమానం కూడా విలవిలలాడి పోయింది. గంటకు పైగా విమానాశ్రయంలోనే నిలిచి పోయింది. వీటి బారి నుంచి ప్రయాణీకులను కాపాడేందుకు విమానాశ్రయ సిబ్బంది రెండు అంబులెన్స్‌లు రప్పించారు. ఈ ఘటన రష్యాలోని నుకోవ్‌ ఎయిర్‌పోర్టులో జరిగింది. రోషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ -319 మాస్కో నుంచి మంగళవారం ఉదయం నుకోవ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ నుంచి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరుతుండగా, వందలాది తేనెటీగలు విమానంపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు విమాన ప్రయాణీకులు నానా తంటాలు పడ్డారు. చివరకు విమానాశ్రయ సిబ్బంది రంగంలోకి దిగి అంబులెన్స్‌లు పిలిపించి ప్రయాణీకులను కాపాడారు. అతికష్టం మీద తేనెటీగలను అక్కడ నుంచి చెదరగొట్టారు. గంట సేపు తిప్పలు పడ్డాక తేనెటీగల బారి నుంచి విమానాన్ని కాపాడి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు సాగనంపారు.
First Published:  8 July 2015 1:05 PM GMT
Next Story