Telugu Global
NEWS

మ‌హిళా త‌హ‌సిల్దారుపై దేశం ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ దాడి

ఇసుక మాఫీయా బ‌రితెగించి ముసునూరు త‌హ‌సిల్దారు వ‌న‌జాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ ఇత‌ర ప్ర‌భుత్వ సిబ్బందిపై దాడి చేశారు. కృష్ణా జిల్లా రంగంపేట‌లో ఇసుక అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతుంద‌ని తెలుసుకున్న రెవిన్యూ సిబ్బంది అక్క‌డ‌కు వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో మాఫియా గూండాలు రెవిన్యూ సిబ్బందిపై దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో త‌హ‌సిల్దారు వ‌న‌జాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌తో స‌హా ఇత‌ర సిబ్బంది కూడా గాయ‌ప‌డ్డారు. ఈ దాడిలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, […]

మ‌హిళా త‌హ‌సిల్దారుపై దేశం ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ దాడి
X
ఇసుక మాఫీయా బ‌రితెగించి ముసునూరు త‌హ‌సిల్దారు వ‌న‌జాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ ఇత‌ర ప్ర‌భుత్వ సిబ్బందిపై దాడి చేశారు. కృష్ణా జిల్లా రంగంపేట‌లో ఇసుక అక్ర‌మ ర‌వాణా జ‌రుగుతుంద‌ని తెలుసుకున్న రెవిన్యూ సిబ్బంది అక్క‌డ‌కు వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో మాఫియా గూండాలు రెవిన్యూ సిబ్బందిపై దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో త‌హ‌సిల్దారు వ‌న‌జాక్షి, రెవిన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌తో స‌హా ఇత‌ర సిబ్బంది కూడా గాయ‌ప‌డ్డారు. ఈ దాడిలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, ఆయ‌న మ‌నుషులు హ‌స్త‌ముంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని త‌హ‌సిల్దారు వ‌న‌జాక్షి కూడా ధ్రువీక‌రించారు. ఇసుక అక్ర‌మ ర‌వాణాను అడ్డుకున్నందుకే త‌మ‌పై ఎమ్మెల్యే దాడి చేశార‌ని ఆమె చెప్పారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లం ద‌గ్గ‌రికి చేరుకున్నారు. కాగా మహిళా తాహసిల్దారు వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే దాడి చేసిన విషయం తనకు తెలియదని, విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పీతల సుజాత అన్నారు. వనజాక్షి మహిళా అధికారి అని కూడా చూడకుండా దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ డిమాండు చేశారు.
First Published:  8 July 2015 3:59 PM IST
Next Story