ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కు త్వరలో షెడ్యూలు
ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌కు షెడ్యూలును త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పుతో బుధవారం ప్రారంభం కావల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం చేపట్టిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాల్సిందిగా రాష్ట్రంలోని గుర్తింపు లేని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం ఆ కళాశాలలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గుర్తింపు రాని కాలేజీలకు అనుబంధ గుర్తింపునివ్వాలని, రద్దు చేసిన కోర్సులను, సీట్లను వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలని […]
BY sarvi7 July 2015 1:09 PM GMT
sarvi Updated On: 8 July 2015 3:13 AM GMT
ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌కు షెడ్యూలును త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పుతో బుధవారం ప్రారంభం కావల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం చేపట్టిన కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాల్సిందిగా రాష్ట్రంలోని గుర్తింపు లేని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం ఆ కళాశాలలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గుర్తింపు రాని కాలేజీలకు అనుబంధ గుర్తింపునివ్వాలని, రద్దు చేసిన కోర్సులను, సీట్లను వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 86 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా హైకోర్టు తీర్పుతో వాటి సంఖ్య మరో 40 వేల వరకూ పెరిగే అవశాముంది.
Next Story