కోన శతజయంతోత్సవాలకు రాష్ట్రపతికి ఆహ్వానం
మాజీ గవర్నర్, మాజీ మంత్రి దివంగత కోనప్రభాకర్‌రావు శతజయంత్యుత్సవాలకు హాజరు కావాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఎమ్మెల్యే కోన రఘుపతి, కోన రమాదేవి ఆహ్వానించారు. ఈనెల 10 నుంచి 2016 జూలై 1 వరకు ఏడాదిపాటు కోన ప్రభాకర్‌రావు శత జయంత్యుత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ నాయకుడిగా, క్రీడాకారుడిగా, నటుడిగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేకోన వివరించారు. వేడుకలలో ఏదో ఒకరోజు పాల్గొంటానని రాష్ట్రపతి చెప్పినట్లు ఎమ్మెల్యే కోన మంగళవారం విలేకరులకు […]
BY sarvi7 July 2015 7:01 PM IST
sarvi Updated On: 8 July 2015 11:27 AM IST
మాజీ గవర్నర్, మాజీ మంత్రి దివంగత కోనప్రభాకర్‌రావు శతజయంత్యుత్సవాలకు హాజరు కావాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఎమ్మెల్యే కోన రఘుపతి, కోన రమాదేవి ఆహ్వానించారు. ఈనెల 10 నుంచి 2016 జూలై 1 వరకు ఏడాదిపాటు కోన ప్రభాకర్‌రావు శత జయంత్యుత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయ నాయకుడిగా, క్రీడాకారుడిగా, నటుడిగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేకోన వివరించారు. వేడుకలలో ఏదో ఒకరోజు పాల్గొంటానని రాష్ట్రపతి చెప్పినట్లు ఎమ్మెల్యే కోన మంగళవారం విలేకరులకు తెలిపారు. బాపట్ల నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషిచేసిన కోనప్రభాకర్‌రావు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి విద్యావ్యాప్తికి కృషిచేశారని తెలిపారు. ఎమ్మెల్యేగా , ఎమ్మెల్సీగా , ఆర్థికమంత్రిగా , గవర్నర్‌గా ప్రజాసేవ చేశారని అన్నారు. డిసెంబర్ – జనవరి మధ్య ఏదో నెలలలో ఒకరోజు రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉందన్నారు.
Next Story