Telugu Global
Cinema & Entertainment

బిజినెస్ మాన్ పాత్రలో జూనియర్

జూనియ‌ర్ ఎన్టీఆర్   మంచి మాస్ ఫాలోయింగ్ వున్న హీరో.  ఇటువంటి హీరోల‌తో సినిమాలు చేసే ట‌ప్పుడు ..  ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాల్సిందే. క‌థ‌ను మేళ విడిచి సాము చేస్తే..  నిర్మాత కు  నిద్ర ప‌ట్ట‌దు.    మాస్ ఫాలోయింగ్ వున్న హీరోల‌తో సినిమా  ఎవ‌రు చేసినా..  క‌చ్చితంగా  ఆ వ‌ర్గ‌పు ఆడియ‌న్స్ ను మెప్పించే ఎలిమెంట్స్ ఎక్కువ శాతం ఉండాలి. ఇది ఒక వ్యాపార‌పు  లెక్క‌.   ఇలా చేయ‌ని సంద‌ర్బాల్లో   ఆ హీరోలు చేసిన చిత్రాలు  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర   […]

బిజినెస్ మాన్ పాత్రలో జూనియర్
X

జూనియ‌ర్ ఎన్టీఆర్ మంచి మాస్ ఫాలోయింగ్ వున్న హీరో. ఇటువంటి హీరోల‌తో సినిమాలు చేసే ట‌ప్పుడు .. ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవాల్సిందే. క‌థ‌ను మేళ విడిచి సాము చేస్తే.. నిర్మాత కు నిద్ర ప‌ట్ట‌దు. మాస్ ఫాలోయింగ్ వున్న హీరోల‌తో సినిమా ఎవ‌రు చేసినా.. క‌చ్చితంగా ఆ వ‌ర్గ‌పు ఆడియ‌న్స్ ను మెప్పించే ఎలిమెంట్స్ ఎక్కువ శాతం ఉండాలి. ఇది ఒక వ్యాపార‌పు లెక్క‌. ఇలా చేయ‌ని సంద‌ర్బాల్లో ఆ హీరోలు చేసిన చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రివ‌ర్స్ స్వింగ్ చేసిన విష‌యం మ‌న‌కు విదిత‌మే.

అస‌లు విష‌యం ఏమిటంటే.. ప్ర‌స్తుతం సుకుమార్ యంగ్ టైగ‌ర్ తో దండ యాత్ర పేరు తో ఒక సినిమా ప్రారంభించారు. లండ‌న్ లో షూటింగ్ చేస్తున్నారు. దాదాపు రెండు నెల‌ల పాటు అక్క‌డే షూటింగ్ వుంటుంద‌ని తెలుస్తుంది. ఇదిలా వుంటే ఎన్టీఆర్ లుక్ ఒక‌టి సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఏదో అర‌బ్ సేట్‌.. లండ‌న్ దొర పెంచుకున్న‌ట్లు గ‌డ్డం .. హై ఫై మెట్రో సిటి యంగ్ బిజినెస్ మెన్ లుక్ లో క‌నిపించాడు. ఎన్టీఆర్ బాగా స‌న్న‌గా క‌నిపిస్తున్నాడు. ఆయ‌న హైట్ కాస్తా త‌క్కువ కాబ‌ట్టి..మ‌రి స‌న్న‌గా ఉంటే లుక్ ఆడియ‌న్స్ కు అంత‌గ నొప్ప‌దు.

గ‌త యేడాది మ‌హేష్ బాబు తో క‌ష్ట‌ప‌డి వ‌న్ సినిమాను సుకుమార్ చేశాడు. మేకింగ్ ప‌రంగా అద్భుతంగా ఉంది. క‌థ ప‌రంగా మ‌న ఆడియ‌న్స్ కు రీచ్ అయ్యేలా చేసుకోలేదు. దాంతో మ‌హేష్ బాబు చిత్రం డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. మ‌రి ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ సినిమా కు సంబంధించి ద‌ర్శ‌కుడు సుకుమార్ ఎంత వ‌ర‌కు గుర్తు పెట్టుకున్నాడో ..? మాస్ ను మ‌రిచిపోయి… క‌థ ఎక్క‌డెక్క‌డో చ‌క్క‌ర్లు కొడితే… బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొమ్మ గింగ‌రాలు తిరిగ‌డం ఖాయం !.

First Published:  8 July 2015 3:30 AM IST
Next Story