జర నవ్వండి ప్లీజ్ 137
జడ్జి : ఐతే మీ ఆయనకు విడాకులివ్వాలనుకుంటున్నారన్నమాట ఆమె : అదేం కాదు జడ్జిగారు! ఇరవై సంవత్సరాలు కాపురం చేశాక మా ఆయన్ని సుఖంగా ఉండనిస్తానా? ————————————————- జ్యోతి బాయ్‌ఫ్రెండ్ ఆమెను బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. జ్యోతి వాళ్ళమ్మతో “మమ్మీ! రాజీవ్ విపరీతంగా డబ్బు ఖర్చుపెడుతున్నాడు. మానిపించాలంటే మార్గమేమిటి?” అంది. జ్యోతి తల్లి : “వెంటనే అతన్ని పెళ్ళి చేసుకో” అంది. ————————————————- “ఈ పుస్తకం చదివితే నువ్వనుకున్నది సగం సాధించినట్లు” “ఐతే రెండు […]
జడ్జి : ఐతే మీ ఆయనకు విడాకులివ్వాలనుకుంటున్నారన్నమాట
ఆమె : అదేం కాదు జడ్జిగారు! ఇరవై సంవత్సరాలు కాపురం చేశాక మా ఆయన్ని సుఖంగా ఉండనిస్తానా?
————————————————-
జ్యోతి బాయ్‌ఫ్రెండ్ ఆమెను బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. జ్యోతి వాళ్ళమ్మతో “మమ్మీ! రాజీవ్ విపరీతంగా డబ్బు ఖర్చుపెడుతున్నాడు. మానిపించాలంటే మార్గమేమిటి?” అంది.
జ్యోతి తల్లి : “వెంటనే అతన్ని పెళ్ళి చేసుకో” అంది.
————————————————-
“ఈ పుస్తకం చదివితే నువ్వనుకున్నది సగం సాధించినట్లు”
“ఐతే రెండు పుస్తకాలివ్వండి”.
————————————————-
ఒక రాజకీయ నాయకుడు ఉపన్యసిస్తుంటే సభలోనించి “అబద్ధాలకోరు” అని ఎవరో అరిచారు. తెలివైన ఆ రాజకీయవేత్త ఉపన్యాసం కాసేపు ఆపి “అయ్యా! పెద్దమనిషీ! నీ పేరైతే చెప్పావు కానీ నువ్వేం చెప్పదలచుకున్నావో మాకు తెలిసేదెలా” అన్నాడు.