అమ్మకాని అమ్మ చూపిన నరకం!
సవతి తల్లి, కన్నతండ్రి… ఇద్దరూ కలిసి కూతురు కాని కూతురును చిత్రహింసలు పాల్జేశారు. ఇంట్లో చాకిరీ చేయించుకుంటే శారీరకంగా హింసలకు గురిచేసిందా కసాయి మారు తల్లి. నిత్యం కరెంట్ వైర్‌తో కొట్టడం వారి పని. అన్నం పెట్టమంటే యాసిడ్, ఫినాయిల్, ఉప్పు, కారం కలిపిన అన్నాన్ని తినిపించే ప్రయత్నం. ఇదేంమని ప్రశ్నిస్తే చిత్రహింసలు. కసాయి తనానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదేమో. ఎల్బీనగర్ బండ్లగూడలో జరిగిన అమానుషమిది. ప్రత్యూష చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఐదేళ్ల క్రితం తల్లి […]
BY sarvi8 July 2015 11:53 AM IST
X
sarvi Updated On: 8 July 2015 2:36 PM IST
సవతి తల్లి, కన్నతండ్రి… ఇద్దరూ కలిసి కూతురు కాని కూతురును చిత్రహింసలు పాల్జేశారు. ఇంట్లో చాకిరీ చేయించుకుంటే శారీరకంగా హింసలకు గురిచేసిందా కసాయి మారు తల్లి. నిత్యం కరెంట్ వైర్‌తో కొట్టడం వారి పని. అన్నం పెట్టమంటే యాసిడ్, ఫినాయిల్, ఉప్పు, కారం కలిపిన అన్నాన్ని తినిపించే ప్రయత్నం. ఇదేంమని ప్రశ్నిస్తే చిత్రహింసలు. కసాయి తనానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదేమో. ఎల్బీనగర్ బండ్లగూడలో జరిగిన అమానుషమిది. ప్రత్యూష చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఐదేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో మేనమామ ఆమెను అనాధాశ్రయంలో చేర్పించారు. ఇంటికి పని మనిషి కావాలనిపించిందేమో కొంతకాలానికి తండ్రి వెళ్లి ప్రత్యూషను ఇంటికి తీసుకువచ్చాడు. కొత్తలో కొన్ని రోజులు బాగానే చూసుకున్న సవతి తల్లి క్రమంగా రాక్షసిగా మారింది. ఇంట్లో పనులు చేయడం లేదంటూ ఆమె ఒంటిపై యాసిడ్ పోసి అమానుషానందం అనుభవించిందా మారు తల్లి. కర్రలతో కొట్టడం, కరెంట్ వైర్లతో వాతలు తేలేలా చితకబాదడం సవతి తల్లి చాముండేశ్వరికి మామూలై పోయింది. తనకు సర్ఫ్, సున్నం నీళ్ళు కలిపి తాగించేవారని, బాత్‌రూంకి వెళ్ళాలన్నా వెళ్ళనిచ్చేవారు కాదని ప్రత్యూష ఆరోపిస్తోంది. ఇంత జరుగుతున్నా కన్న తండ్రి రమేష్ చోద్యం చూసాడే తప్ప భార్యను మందలించిన పాపాన పోలేదు. పైగా అతను టెలికాం శాఖలో ఉన్నతోద్యోగి. మేనమామ ఇంట్లో, ఆ తరువాత అనాధాశ్రయంలో హింస అనుభవించానని తండ్రి బాగా చూసుకుంటాడనుకుంటే నరకం చూపించారని ప్రత్యూష పోలీసుల ముందు, మహిళా ప్రతినిధుల ముందు కన్నీటి పర్యంతమైంది. పొరుగువారి సమాచారంతో బాలల హక్కుల సంఘం ప్రతినిధులు పోలీసులతో వెళ్లి ప్రత్యూషకు విముక్తి కలిగించారు. తనను ఇంక ఆ ఇంటికి పంపవద్దని ఏదైనా అనాధాశ్రయానికి పంపాలని ఆ బాలిక కనిపించవారినల్లా వేడుకోవడం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. సవతి తల్లి శ్యామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తండ్రి రమేష్ పరారీలో ఉన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story