Telugu Global
Others

ప్రియాంకాగాంధీకి అనుకూలంగా హైకోర్టు స్టే

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కొనుగోలు చేసిన భూ వివరాలు ఇవ్వాలంటూ ఆర్టీఐ కార్యకర్త దేవాశిష్‌ భట్టాచార్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ ఆగస్టు 7న ఉంటుందని కోర్టు పేర్కొంది. భట్టాచార్య సమాచార కమిషన్‌కి దరఖాస్తు చేస్తూ తనకు ప్రియాంక కొనుగోలు చేసిన భూమి వివరాలు కావాలని అభ్యర్థించారు. ఆమె అంతకుముందే హిమాచల్‌ ప్రభుత్వానికి తన లాయర్‌ ద్వారా ఓ లేఖ రాస్తూ భద్రతా కారణాల దృష్ట్యా వీటిని […]

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ కొనుగోలు చేసిన భూ వివరాలు ఇవ్వాలంటూ ఆర్టీఐ కార్యకర్త దేవాశిష్‌ భట్టాచార్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ ఆగస్టు 7న ఉంటుందని కోర్టు పేర్కొంది. భట్టాచార్య సమాచార కమిషన్‌కి దరఖాస్తు చేస్తూ తనకు ప్రియాంక కొనుగోలు చేసిన భూమి వివరాలు కావాలని అభ్యర్థించారు. ఆమె అంతకుముందే హిమాచల్‌ ప్రభుత్వానికి తన లాయర్‌ ద్వారా ఓ లేఖ రాస్తూ భద్రతా కారణాల దృష్ట్యా వీటిని ఎవరికీ ఇవ్వరాదని అభ్యర్థించారు. భట్టాచార్యకు ఇదే కారణంతో వివరాలు ఇవ్వడానికి నిరాకరించగా ఆయన దీనిపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా పది రోజుల్లోగా వివరాలు అందజేయాలని సదరు విభాగం అధికారి ఆదేశించారు. అయినా కావలసిన సమాచారం అందజేయకపోవడంతో భట్టాచార్య కోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న కోర్టు ప్రియాంకకు అనుకూలంగా ఉత్తర్వు ఇస్తూ కేసుపై స్టే విధించింది. వచ్చేనెల 7న దీనిపై మళ్ళీ విచారణ జరుగుతుంది.

First Published:  7 July 2015 7:03 PM IST
Next Story