Telugu Global
Others

తెలుగు గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ హైస్పీడ్‌ బ్రాడ్ బ్యాండ్ సేవలు 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్‌ ఇండియా వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా 2 లక్షల 50 వేల గ్రామ పంచాయతీలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలందించనుంది. అందులో ఏపీ, తెలంగాణలోని 21,265 పంచాయతీలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో ఇంటర్నెట్‌ సేవలందించనున్నట్లు టెలికాం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పీవీ మురళీధర్‌ వెల్లడించారు. తెలంగాణలో 8,779 ఆంధ్రాలో 12,876 గ్రామాలకు ఈ సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. జనాభా సంఖ్యను బట్టి పబ్లిక్‌ ప్లేసుల్లో 2 […]

తెలుగు గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ హైస్పీడ్‌ బ్రాడ్ బ్యాండ్ సేవలు 
X
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్‌ ఇండియా వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా 2 లక్షల 50 వేల గ్రామ పంచాయతీలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలందించనుంది. అందులో ఏపీ, తెలంగాణలోని 21,265 పంచాయతీలకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో ఇంటర్నెట్‌ సేవలందించనున్నట్లు టెలికాం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పీవీ మురళీధర్‌ వెల్లడించారు. తెలంగాణలో 8,779 ఆంధ్రాలో 12,876 గ్రామాలకు ఈ సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. జనాభా సంఖ్యను బట్టి పబ్లిక్‌ ప్లేసుల్లో 2 ఎంబీపీఎస్‌ నుంచి 200 ఎంబీపీఎస్‌ వరకూ వైఫై సేవలందిస్తాం. ప్రతి రోజూ 20 నిమిషాల పాటు ఉచితంగా వైఫై సేవలను వాడుకోవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రత్యేకంగా 47 చోట్ల వైఫై సౌకర్యం కల్పించామని, బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అన్ని నెట్‌వర్కలతో ఉచితంగా మాట్లాడుకోవచ్చని ఆయన చెప్పారు. కమ్యూనికేషన్‌ రంగాన్ని ప్రజలకు మరింత చేరువ‌ చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ రోమింగ్ చార్జీలను ఎత్తివేసిందని ఆయన చెప్పారు.
First Published:  7 July 2015 6:46 PM IST
Next Story