నిధులన్నీ మామా అల్లుళ్ల శాఖలకే: భట్టి విమర్శ
ముఖ్యమంత్రి కేసీఆర్ తన అల్లుడు, కొడుకు శాఖలకు నిధులిచ్చుకుని అదే తెలంగాణ అభివృద్ధంటూ చెప్పుకుని మురిసి పోతున్నారని టీపీసీసీ నేత మల్లు భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మామా అల్లుళ్లు పరస్పరం అభినందించుకోవడం అభివృద్ధి కాదని ఆయన విమర్శించారు. గాంధీభవనలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున మల్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పట్టణాలు, నగరాలను […]
BY admin7 July 2015 6:49 PM IST
X
admin Updated On: 8 July 2015 9:50 AM IST
ముఖ్యమంత్రి కేసీఆర్ తన అల్లుడు, కొడుకు శాఖలకు నిధులిచ్చుకుని అదే తెలంగాణ అభివృద్ధంటూ చెప్పుకుని మురిసి పోతున్నారని టీపీసీసీ నేత మల్లు భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మామా అల్లుళ్లు పరస్పరం అభినందించుకోవడం అభివృద్ధి కాదని ఆయన విమర్శించారు. గాంధీభవనలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున మల్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ సిబ్బంది, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Next Story