Telugu Global
Others

మూతపడనున్న ‘ఫ్లిప్‌కార్ట్’ వెబ్‌సైట్‌

ఆన్‌లైన్ ఈ- కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ తన వెబ్‌సైట్‌ను మూసేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ నుంచి ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ ద్వారానే అమ్మకాలు సాగించాలని నిర్ణయించుకుంది. గతంలో కూడా ఈ సంస్థ ఇలాగే ప్రకటించింది. అయితే సెప్టెంబర్ నుంచి ఈ మార్పులు జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాదాపు 70 నుంచి 75 శాతం అమ్మకాలు యాప్స్ ద్వారానే సంస్థ కొనసాగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునీత్ సోనీ వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫ్యాషన్ […]

ఆన్‌లైన్ ఈ- కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ తన వెబ్‌సైట్‌ను మూసేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ నుంచి ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ ద్వారానే అమ్మకాలు సాగించాలని నిర్ణయించుకుంది. గతంలో కూడా ఈ సంస్థ ఇలాగే ప్రకటించింది. అయితే సెప్టెంబర్ నుంచి ఈ మార్పులు జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాదాపు 70 నుంచి 75 శాతం అమ్మకాలు యాప్స్ ద్వారానే సంస్థ కొనసాగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునీత్ సోనీ వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫ్యాషన్ వెబ్‌సైట్ ‘మింత్రా’ కూడా ఇటీవలే మొబైల్ యాప్స్ ద్వారా అమ్మకాలు సాగిస్తోంది. ఈ తరహా సేవల్లోకి మారిన తర్వాత అమ్మకాల్లో కేవలం 10 శాతం మాత్రమే తగ్గాయని, 90 శాతం యాప్స్ ద్వారానే ట్రాఫిక్ వస్తుందని ఆ సంస్థ తెలిపింది.
First Published:  7 July 2015 6:36 PM IST
Next Story