ఫీల్డ్‌లో బంతి తగిలి బ్రిటన్‌లో తమిళ క్రికెటర్ మృతి
ప్రవాస భారతీయుడు ఒకరు క్రికెట్ ఆడుతూ దుర్మరణం పాలయ్యారు. తమిళనాడుకు చెందిన బవలాన్ పద్మనాథన్ బ్రిటిష్ తమిళ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లండన్‌లోని లాంగ్ డిట్టన్ రిక్రియేషన్ క్లబ్‌లో క్రికెట్ ఆడుతుండగా వేగంగా వచ్చిన బాల్ ఛాతికి తగిలి గాయపడ్డారు. ఆ సమయంలో పద్మనాథన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆయన గాయపడినప్పుడు ఓ అంబులెన్స్‌ను, రెండు కార్లను, మరో ఎయిర్ అంబులెన్స్‌ను కూడా పంపామని, సంఘటన స్థలిలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆస్పత్రికి పంపిస్తుండగా దురదృష్టవశాత్తూ 24 […]
ప్రవాస భారతీయుడు ఒకరు క్రికెట్ ఆడుతూ దుర్మరణం పాలయ్యారు. తమిళనాడుకు చెందిన బవలాన్ పద్మనాథన్ బ్రిటిష్ తమిళ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లండన్‌లోని లాంగ్ డిట్టన్ రిక్రియేషన్ క్లబ్‌లో క్రికెట్ ఆడుతుండగా వేగంగా వచ్చిన బాల్ ఛాతికి తగిలి గాయపడ్డారు. ఆ సమయంలో పద్మనాథన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆయన గాయపడినప్పుడు ఓ అంబులెన్స్‌ను, రెండు కార్లను, మరో ఎయిర్ అంబులెన్స్‌ను కూడా పంపామని, సంఘటన స్థలిలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆస్పత్రికి పంపిస్తుండగా దురదృష్టవశాత్తూ 24 యేళ్ళ పద్మనాథ్ చనిపోయారని సౌతీస్ట్ కోస్ట్ అంబులెన్స్ సర్వీసు ప్రతినిధి తెలిపారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఫీల్డ్ ఏరియాలో ఆటగాళ్ళ పట్ల తీసుకుంటున్న భద్రత చర్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా మాజీ ఇంటర్నేషనల్ ఆటగాడు ఫిలిప్ హాగ్ కూడా ఇలా ఫీల్డ్‌లోనే చనిపోవడం ఈ సందర్భంగా భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి.