అవినీతిపై మోడి మౌనం వీడాలి: బీవీ రాఘవులు
దేశంలో విచ్చలవిడిగా పెరిగి పోతున్న అవినీతి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు డిమాండు చేశారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వాలను ఊపేస్తున్న అవినీతి కుంభకోణాలపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటాన్ని సీపీఎం తప్పుపట్టింది. ఢిల్లీలో రెండురోజులపాటు జరిగిన పోలిట్‌బ్యూరో ముగిసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాము ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన చర్చించామని తెలిపారు. అవినీతి కంటే అతి ముఖ్యమైన అంశాలపైన […]
BY sarvi8 July 2015 6:41 AM IST
X
sarvi Updated On: 8 July 2015 6:41 AM IST
దేశంలో విచ్చలవిడిగా పెరిగి పోతున్న అవినీతి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు డిమాండు చేశారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వాలను ఊపేస్తున్న అవినీతి కుంభకోణాలపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటాన్ని సీపీఎం తప్పుపట్టింది. ఢిల్లీలో రెండురోజులపాటు జరిగిన పోలిట్‌బ్యూరో ముగిసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాము ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన చర్చించామని తెలిపారు. అవినీతి కంటే అతి ముఖ్యమైన అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పలేదని బిజెపి ప్రచారం చేస్తుండడం దుర్మార్గమన్నారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి…అవినీతి అంత ప్రధానమైనది కాదనడం దారుణమని విమర్శించారు.
మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంలో సాక్షులు, నేరస్తుల వరుస మరణాలు ప్రభుత్వంపైఅనుమానాలను రెట్టింపు చేస్తున్నాయన్నారు. వ్యాపంపై సిబిఐ విచారణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివారాజ్‌సింఘ్ చౌహాన్‌తో సహా అందరూ డిమాండు చేస్తుంటే… కేంద్ర ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఆలోచిస్తామన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయన్నారు. నిజానిజాల నిర్థరణకు సిబిఐ విచారణకు ఆదేశించాలని సిపిఎం డిమాం డ్ చేస్తోందని రాఘవులు చెప్పారు. వాస్తవం గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ విచారణకు చేపట్టేందుకు న్యాయ స్థానాలు అడ్డురావని సిపిఎం అభిప్రాయ పడిందన్నారు. అన్నివైపుల వత్తిడి పెరగటంతో…తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే బయట పల్లకీ మోతకు మోడీ ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని రాఘవులు ఆరోపించారు.
కలిసి పని చేద్దాం రండి: పవన్‌కు సీపీఎం ఆఫర్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికైనా జనంలోకి వచ్చి వారి సమస్యలపై పోరాడాలని సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు హితవు పలికారు. అప్పుడప్పుడు జనంలోకి వచ్చి మాట్లాడడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదని, ఏదో నిద్ర నుంచి లేని వచ్చి మాట్లాడినట్టు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. చాలా రోజుల తరువాత ఆయనకు దేశం, రాష్ట్రం గుర్తు రావడం సంతోషమన్నారు. ఆలస్యంగానైనా ఆయన స్పందించడం సంతోషమన్నారు. పవన్ ఏమైనా కార్యాచరణ చేపడితే జనం ఆయన మాటలు నమ్ముతారని హితవు పలికారు. పవన్ చాలా ఉపదేశాలు ఇచ్చారని… కనీసం ఇప్పుడైనా స్పందించి జనం ముందుండి నడిపించాలని, ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఏదైనా జనానికి ఉపయోగపడే పనులు చేస్తే తాము కూడా కలిసి నడుస్తామని చెప్పారు.
Next Story