సోమవారం సంచలనాలు!
ఓటుకు నోటు కేసులో సోమవారం పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ వ్యూహాన్ని పసిగట్టడంలో విఫలమయ్యారన్న ఆరోపణలతో ఇంటలిజెన్్స డీజీ అనురాధను బదిలీ చేసింది ఏపీ సర్కారు. అలాగే విజయవాడ పోలీసు కమిషనర్ వెంకటేశ్వరారావు స్థానంలో సీనీయర్ ఐపీఎస్ గౌతం సవాంగ్‌ను నియమించింది. అనురాధ బదిలీ వూహించిందే! వాస్తవానికి ఇది జూన్ మొదటివారంలో జరిగాల్సింది. వెంటనే చర్యలు తీసుకుంటే తప్పు ఒప్పకున్నట్లు అవుతుందని సీనియర్ అధికారుల సూచనలతోనే ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇక […]
BY Pragnadhar Reddy7 July 2015 3:33 AM IST
X
Pragnadhar Reddy Updated On: 7 July 2015 9:40 AM IST
ఓటుకు నోటు కేసులో సోమవారం పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ వ్యూహాన్ని పసిగట్టడంలో విఫలమయ్యారన్న ఆరోపణలతో ఇంటలిజెన్్స డీజీ అనురాధను బదిలీ చేసింది ఏపీ సర్కారు. అలాగే విజయవాడ పోలీసు కమిషనర్ వెంకటేశ్వరారావు స్థానంలో సీనీయర్ ఐపీఎస్ గౌతం సవాంగ్‌ను నియమించింది. అనురాధ బదిలీ వూహించిందే! వాస్తవానికి ఇది జూన్ మొదటివారంలో జరిగాల్సింది. వెంటనే చర్యలు తీసుకుంటే తప్పు ఒప్పకున్నట్లు అవుతుందని సీనియర్ అధికారుల సూచనలతోనే ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇక పవన్‌కల్యాణ్ ప్రెస్ మీట్! ఓటుకు నోటు విషయంపై నోరు మెదుపుతానని ఇంతకాలం కాలం వెళ్లబచ్చుతూ వచ్చిన పవన్ అసలు విషయం తప్పా అన్నీ మాట్లాడారు. రోడ్డు మీద జనాలు కొట్టుకున్న విషయాన్ని పార్టీ అధినేతగా వర్ణించిన తీరు ఆయన అవగాహనకు నిదర్శనం. అలాగే రెండు రాష్ర్టా సీఎంల రాజకీయ అనుభవం, పవన్ కల్యాణ్ వయసు దాదాపు సమానం. అలాంటి పవన్ ఇద్దరికీ రాజకీయ పాఠాలు చెప్పి ఔరా! అనిపించారు. ఓవైపు పవన్ ప్రెస్ మీట్ కొనసాగుతుండగానే..మరోవైపు సండ్ర అరెస్టు అయ్యారన్న వార్త ఆయన లైవ్ కవరేజీకి అంతరాయం కలిగించింది. టీడీపీ నేతల పాత్రపై మాట్లాడనని చెప్పిన పవన్ మరోసారి చంద్రబాబు పక్షం వహించారని విమర్శలను మూటగట్టుకున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టకండని, చంద్రబాబు మెప్పు పొందే ప్రయత్నం చేశారని టీఆర్ ఎస్, వైఎస్సార్ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఈ కేసులో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన జిమ్మి బాబు మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సోమవారం ఆయన విచారణకు హాజరుకాలేదు. విషయం తెలుసుకున్న ఏసీబీ డీజీ ఖాన్ వెంటనే గాలింపునకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో జిమ్మిబాబు దొరికితే అరెస్టేనన్న సంకేతాలు పరోక్షంగా ఇచ్చినట్లయింది.
Next Story