క్రమంగా పెళ్ళిళ్ళకు దూరమవుతున్న యువత!
మంచి సంబంధాలు దొరక్క, దొరికిన సంబంధంతో సంతృప్తి చెందలేక పెళ్ళిళ్ళు కాకుండా మిగిలి పోతున్నారు ఈనాటి యువత. అసలే అమ్మాయిలు దొరక్క ఇబ్బంది పడుతున్న వేళ దొరికిన వాళ్లతో కూడా సంతృప్తి చెందలేక ప్రతి తల్లిదండ్రులు మధనపడే విషయం ఇది. పెళ్లి కాని వాళ్ల సంఖ్య పెరగడమనేది దేశవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారుతోందని చెబుతోంది సోషియో ఎకనమిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ (సెక్). మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు కాని వారు సుమారు 41.64 శాతం […]
BY sarvi5 July 2015 6:43 PM IST
sarvi Updated On: 6 July 2015 6:01 AM IST
మంచి సంబంధాలు దొరక్క, దొరికిన సంబంధంతో సంతృప్తి చెందలేక పెళ్ళిళ్ళు కాకుండా మిగిలి పోతున్నారు ఈనాటి యువత. అసలే అమ్మాయిలు దొరక్క ఇబ్బంది పడుతున్న వేళ దొరికిన వాళ్లతో కూడా సంతృప్తి చెందలేక ప్రతి తల్లిదండ్రులు మధనపడే విషయం ఇది. పెళ్లి కాని వాళ్ల సంఖ్య పెరగడమనేది దేశవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారుతోందని చెబుతోంది సోషియో ఎకనమిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ (సెక్). మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు కాని వారు సుమారు 41.64 శాతం మంది ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో వరుసగా నాగాలాండ్, మేఘాలయ, జమ్ము-కశ్మీర్ చేరాయిప్పుడు. నాగాలాండ్‌లోని పల్లెల్లో అయితే మరీ ఘోరం. అక్కడ సుమారు 55.88 శాతం మంది పెళ్లిళ్లు చేసుకోలేదని ఆ అధ్యయనం చెబుతోంది. మిగిలిన రాష్ట్రాల్లోను ఇంచుమించు అదే పరిస్థితి. ఎక్కువ శాతం పెళ్లిళ్లు అయిన వాళ్లలో డయ్యు డామన్, అండమాన్ నికోబార్, కేరళ రాష్ట్రాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇక, విడాకులు తీసుకున్న వాళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మిజోరాం, లక్ష్యద్వీప్, మేఘాలయ నిలిచాయి. యుక్తవయసుకు వచ్చిన పిల్లలకు పెళ్లి అనేది పెద్ద సామాజిక సమస్యగా మారిందని, ఈ పరిస్థితులకు మూలకారణాలను తెలుసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. సామాజిక అధ్యయనకారులు పేర్కొంటున్నారు.
Next Story