Telugu Global
Others

నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్‌

బస్సులో ప్రయాణం చేస్తూ బ్యాగ్‌ మరిచి దిగి వెళ్లిపోయిన ప్రయాణికుడికి సంబంధించి 46 వేల నగదు, ఆధార్‌, రేషన్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా పుస్తకాలను డిపోలో అప్పగించి కండక్టర్‌ ఇంతీయాజ్ బేగం తన నిజాయితీని చాటుకున్నారు. మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంథని నుంచి కాటారం వెళ్తున్న మల్హర్‌ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన వాల కిషన్‌రావు తన బ్యాగును బస్సులోనే మరిచి కాటారంలో దిగి వెళ్లిపోయారు. బ్యాగ్‌ను గమనించిన కండక్టర్‌ ఇంతీయాజ్ బేగం అందులో ఉన్న […]

బస్సులో ప్రయాణం చేస్తూ బ్యాగ్‌ మరిచి దిగి వెళ్లిపోయిన ప్రయాణికుడికి సంబంధించి 46 వేల నగదు, ఆధార్‌, రేషన్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా పుస్తకాలను డిపోలో అప్పగించి కండక్టర్‌ ఇంతీయాజ్ బేగం తన నిజాయితీని చాటుకున్నారు. మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంథని నుంచి కాటారం వెళ్తున్న మల్హర్‌ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన వాల కిషన్‌రావు తన బ్యాగును బస్సులోనే మరిచి కాటారంలో దిగి వెళ్లిపోయారు. బ్యాగ్‌ను గమనించిన కండక్టర్‌ ఇంతీయాజ్ బేగం అందులో ఉన్న 46 వేల రూపాయలను, ఇతర కాగితాలను జాగ్రత్తగా తీసుకువచ్చి డిపో సెక్యూరిటీలో అప్పగించారు. దొరికిన డబ్బులు నిజాయితీగా అప్పగించిన ఇంతీయాజ్ బేగంను డిపో మేనేజర్‌ మేకల మల్లేశంతోపాటు డిపోలోని ఉద్యోగులంతా అభినందించారు. ఆధార్‌, రేషన్‌కార్డు ఆధారంగా బాధితుడిని గుర్తించి అతడికి సమాచారం అందించారు. డిపోకు వచ్చిన బాధితుడు కిషన్‌రావుకు డీఎం మల్లేశం నగదును అందజేశారు.
First Published:  5 July 2015 6:39 PM IST
Next Story