Telugu Global
NEWS

రంగారెడ్డి కోర్టు వద్ద భత్కల్‌ కలకలం!

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ళ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్‌ ముజాహిద్దీన్‌ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం సృష్టించాడు. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు హాలులోకి ప్రవేశించిన వెంటనే అతడు జేబులోంచి ఒక లెటరు తీసి కోర్టు కిటికీ నుంచి దానిని బయటకు విసిరాడు. ఇది గమనించిన పోలీసులు ఈ అనూహ్య పరిణామానికి బిత్తరపోయారు. వెంటనే భత్కల్‌ను చుట్టుముట్టి అదుపు చేసే ప్రయత్నం చేశారు. […]

రంగారెడ్డి కోర్టు వద్ద భత్కల్‌ కలకలం!
X
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ళ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్‌ ముజాహిద్దీన్‌ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ రంగారెడ్డి జిల్లా కోర్టులో కలకలం సృష్టించాడు. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు హాలులోకి ప్రవేశించిన వెంటనే అతడు జేబులోంచి ఒక లెటరు తీసి కోర్టు కిటికీ నుంచి దానిని బయటకు విసిరాడు. ఇది గమనించిన పోలీసులు ఈ అనూహ్య పరిణామానికి బిత్తరపోయారు. వెంటనే భత్కల్‌ను చుట్టుముట్టి అదుపు చేసే ప్రయత్నం చేశారు. కిటికీ నుంచి భత్కల్‌ విసిరిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే తాను పారిపోతున్నట్టు ప్రచారం చేస్తున్నారని, తనను ఎన్‌కౌంటర్‌ చేసే ప్రమాదం ఆరోపిస్తూ ఆ లేఖలో పేర్కొన్నాడు.
కాగా తెలంగాణలోనే కాకుండా యాసిన్‌ భత్కల్‌ అనేక రాష్ట్రాల్లో కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ కేసుల విచారణలో భాగంగా ఆయన్ను రాజస్థాన్‌ తీసుకెళ్ళాల్సి ఉంది. అక్కడి పోలీసు శాఖ కోరిక మేరకు కోర్టు పిటి వారెంట్‌ జారీ చేసింది. అతనిపై పీటీ వారెంట్‌ ఉండడంతో ఆయనను రాజస్థాన్‌ తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
First Published:  6 July 2015 9:02 AM IST
Next Story