బ్రిటన్‌లో పదేళ్లలో రెట్టింపైన భారతీయుల సంఖ్య
బ్రిటన్‌లో నేడు సంఖ్యాపరంగా భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇతర విదేశీయులతో పోలిస్తే భారతీయులే అక్కడ గణనీయంగా ఉన్నారు. పదేళ్లలో భారతీయుల సంఖ్య రెట్టింపు అయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్‌లో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. అక్కడ ఉంటున్న అమెరికా, చైనా తదితర దేశస్తుల కంటే భారతీయుల సంఖ్యే ఎక్కువ. గత పదేళ్ళలో బ్రిటన్‌లో నివాసం ఉంటున్న భారతీయుల సంఖ్య రెట్టింపు అయిందని ఆ దేశ జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ భారతీయులు […]
BY sarvi5 July 2015 6:41 PM IST
sarvi Updated On: 6 July 2015 5:57 AM IST
బ్రిటన్‌లో నేడు సంఖ్యాపరంగా భారతీయులు సత్తా చాటుతున్నారు. ఇతర విదేశీయులతో పోలిస్తే భారతీయులే అక్కడ గణనీయంగా ఉన్నారు. పదేళ్లలో భారతీయుల సంఖ్య రెట్టింపు అయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్‌లో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. అక్కడ ఉంటున్న అమెరికా, చైనా తదితర దేశస్తుల కంటే భారతీయుల సంఖ్యే ఎక్కువ. గత పదేళ్ళలో బ్రిటన్‌లో నివాసం ఉంటున్న భారతీయుల సంఖ్య రెట్టింపు అయిందని ఆ దేశ జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ భారతీయులు 7.6 లక్షల మంది ఉంటున్నారు. 8.88 లక్షల మందితో బ్రిటన్‌లో ఫ్రాన్స్ దేశస్థులే అత్యధికంగా నివశిస్తున్నారు. వీరి తర్వాత స్థానం భారతీయులదే. చైనీయులు, అమెరికన్ల కన్నా నాలుగు రెట్లు అధికంగా భారతీయులే ఉన్నారు. జర్మన్, బంగ్లాదేశీయుల కన్నా భారతీయుల సంఖ్య మూడు రెట్లు అధికం.
Next Story