హైటెక్ సిటీ సమీపంలో తెలంగాణ సెక్రటేరియట్
తెలంగాణ సెక్రటేరియట్ హెటెక్‌సిటీ సమీపంలోకి తరలిపోనున్నది. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న శిల్పారామం వెనక సెక్రటేరియట్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మంత్రుల పేషీలు, వాటికి అనుబంధంగా వివిధ విభాగాల అధిపతులు, సెక్రటరీల కార్యాలయాలను అనుసంధానిస్తూ దీనిని నిర్మించబోతున్నారు. ప్రస్తుత సెక్రటేరియట్‌లో మంత్రుల పేషీలు, సెక్రటరీల కార్యాలయాలు వేర్వేరుగా ఉండడంతో ఇబ్బందులెదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కొక్క శాఖకు మూడు అంతస్తులతో భవనాన్ని నిర్మించాలని, అన్నిటినీ అనుసంధానించాలని భావిస్తున్నారు. శిల్పారామం వెనక ఉన్న ప్రభుత్వ భూమిలో […]
తెలంగాణ సెక్రటేరియట్ హెటెక్‌సిటీ సమీపంలోకి తరలిపోనున్నది. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న శిల్పారామం వెనక సెక్రటేరియట్ నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మంత్రుల పేషీలు, వాటికి అనుబంధంగా వివిధ విభాగాల అధిపతులు, సెక్రటరీల కార్యాలయాలను అనుసంధానిస్తూ దీనిని నిర్మించబోతున్నారు. ప్రస్తుత సెక్రటేరియట్‌లో మంత్రుల పేషీలు, సెక్రటరీల కార్యాలయాలు వేర్వేరుగా ఉండడంతో ఇబ్బందులెదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కొక్క శాఖకు మూడు అంతస్తులతో భవనాన్ని నిర్మించాలని, అన్నిటినీ అనుసంధానించాలని భావిస్తున్నారు. శిల్పారామం వెనక ఉన్న ప్రభుత్వ భూమిలో ఈ భవనాలను నిర్మిస్తారు. సెక్రటేరియట్‌తో పాటు అసెంబ్లీ భవనాన్ని కూడా అక్కడే నిర్మించాలని ప్రభుత్వం తలపోస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఒక్కచోట నుంచి సాగిస్తేనే పాలనకు సౌలభ్యంగా ఉంటుందని అది భావిస్తోంది. అయితే దానికి మరికొంత సమయం పట్టవచ్చు. సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత అసెంబ్లీ తరలింపు గురించి ఆలోచిస్తారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం తొలుత ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిని వేరే చోటకు తరలించి ఆ భూమిని సెక్రటేరియట్ నిర్మాణానికి ఉపయోగించుకోవాలని భావించింది. అయితే ఛాతీ ఆసుపత్రి తరలింపుపై అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది. ఆ తర్వాత బైసన్ పోలో గ్రౌండ్‌ను తీసుకోవాలని రక్షణ శాఖను కూడా సంప్రదించింది. అయితే 60 ఎకరాల భూమిని ఇవ్వడానికి రక్షణ శాఖ 600 కోట్ల రూపాయలను డిమాండ్ చేయడంతో ఆ ప్రతిపాదనను కూడా వెనక్కి తీసుకుంది. ఇపుడు శిల్పారామం సమీపంలో నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులూ ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.