గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ నుంచి గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ నెల 14 నుంచి 25 వరకు గ్రేటర్‌జోన్ నుంచి 500 ఆర్టీసీ బస్సులు పుష్కర ప్రయాణికులను తీసుకెళ్లేలా రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నారు. కొంత మంది కలిసి.. ప్రత్యేకంగా బస్సును బుక్‌చేసుకునే సౌకర్యాన్నీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక బస్ కావాలనుకునే వారు స్థానిక డిపోలు, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్టీసీ కార్యాలయాల్లో సంప్రదించాలని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ […]
BY sarvi5 July 2015 1:14 PM GMT
sarvi Updated On: 6 July 2015 12:34 AM GMT
హైదరాబాద్ నుంచి గోదావరి పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ నెల 14 నుంచి 25 వరకు గ్రేటర్‌జోన్ నుంచి 500 ఆర్టీసీ బస్సులు పుష్కర ప్రయాణికులను తీసుకెళ్లేలా రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నారు. కొంత మంది కలిసి.. ప్రత్యేకంగా బస్సును బుక్‌చేసుకునే సౌకర్యాన్నీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక బస్ కావాలనుకునే వారు స్థానిక డిపోలు, జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్టీసీ కార్యాలయాల్లో సంప్రదించాలని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.పురుషోత్తం తెలిపారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు కోసం రూ.17,600, మెట్రో డీలక్స్ రూ. 18,100 చార్జీ వసూలు చేస్తునట్లు తెలిపారు. పుష్కరాలకు ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులలో సాధారణ టికెట్ ధర కంటే చార్జీలు 50 శాతం అదనంగా ఉంటాయని తెలిపారు.
Next Story