నేడు సండ్ర అరెస్టు ?
ఓటుకు నోటు కేసులో నేడు సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసులో తాజాగా తెరపైకి వచ్చిన తెలుగుయువత రాష్ర్ట నాయకుడు జిమ్మిబాబుతోపాటు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అరెస్టు చేయనుందని సమాచారం. ఈకేసులో విచారణకు హాజరుకావాలని ఏసీబీ సండ్రకు నోటీసులు జారీచేసినా ఆయన చాలారోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏ-1 నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ వచ్చేదాకా సండ్ర అజ్ఞాతంలోనే గడిపారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఏపీలో తలదాచుకున్నారు. తమ విచారణకు హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ […]
BY Pragnadhar Reddy5 July 2015 8:47 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 6 July 2015 9:23 AM GMT
ఓటుకు నోటు కేసులో నేడు సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసులో తాజాగా తెరపైకి వచ్చిన తెలుగుయువత రాష్ర్ట నాయకుడు జిమ్మిబాబుతోపాటు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అరెస్టు చేయనుందని సమాచారం. ఈకేసులో విచారణకు హాజరుకావాలని ఏసీబీ సండ్రకు నోటీసులు జారీచేసినా ఆయన చాలారోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏ-1 నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ వచ్చేదాకా సండ్ర అజ్ఞాతంలోనే గడిపారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఏపీలో తలదాచుకున్నారు. తమ విచారణకు హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈసారి సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఎ) కింద నోటీసులు జారీచేయడం విశేషం. ఈ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిన వారిని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉండటంతో ఈ విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఈకేసులో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన పేరు జిమ్మిబాబు. ఇతని స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరిఖని. ప్రస్తుతం తెలుగుయువత రాష్ర్ట నాయకుడుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు ఇచ్చిన రూ.50 లక్షలను కొందరి ప్రముఖుల నుంచి జిమ్మిబాబే తీసుకువచ్చి రేవంత్‌రెడ్డికి ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టుచేయగానే జిమ్మిబాబు గుంటూరులో తలదాచుకున్నట్లు సమాచారం. ఈకేసులో ఎ-4 నిందితుడు జెరుసలేం మత్తయ్య కూడా గుంటూరులోనే తలదాచుకోవడం గమనార్హం. నేడు ఏసీబీ వీరిద్దరిని అరెస్టు చేస్తే వారిచ్చేసమాచారం ఆధారంగా నిందితుల జాబితా మరింత పెరగనుంది.
Next Story