Telugu Global
Others

ఏసీబీ ఎదుట సండ్ర‌

ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఏసీబీ ముందు హాజ‌ర‌య్యారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌న్న సండ్ర‌., చ‌ట్ట‌ప‌రంగా కేసును ఎదుర్కొంటాన్నారు. ఈసారి ఆయ‌న‌కు సీఆర్‌పిసి 41(ఎ)కింద‌ నోటీసులు ఇవ్వ‌డంతో వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసుల‌కు ఉంటుంది. దీంతో సండ్ర‌ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ ప‌రిస్థితినైనా ఎదుర్కొంటాన‌న్న సండ్ర‌., అరెస్ట్‌కి భ‌య‌ప‌డ‌నని స్ప‌ష్టంచేశారు. తెలుగురాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన నిందితుడు రేవంత్‌రెడ్డి బెయిల్‌పై ఇటీవ‌ల […]

ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఏసీబీ ముందు హాజ‌ర‌య్యారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌న్న సండ్ర‌., చ‌ట్ట‌ప‌రంగా కేసును ఎదుర్కొంటాన్నారు. ఈసారి ఆయ‌న‌కు సీఆర్‌పిసి 41(ఎ)కింద‌ నోటీసులు ఇవ్వ‌డంతో వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసుల‌కు ఉంటుంది. దీంతో సండ్ర‌ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ ప‌రిస్థితినైనా ఎదుర్కొంటాన‌న్న సండ్ర‌., అరెస్ట్‌కి భ‌య‌ప‌డ‌నని స్ప‌ష్టంచేశారు. తెలుగురాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన నిందితుడు రేవంత్‌రెడ్డి బెయిల్‌పై ఇటీవ‌ల విడుద‌ల‌య్యారు. అయితే రేవంత్ ద‌గ్గ‌ర‌ ప‌నిచేస్తున్న కొంద‌రికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. వారి వాంగ్మూలం కూడా న‌మోదుచేయ‌నుంది.

First Published:  5 July 2015 6:45 PM IST
Next Story