చిట్టీల పేరుతో రూ.6 కోట్లకు కుచ్చుటోపీ
చిట్టీల పేరుతో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నిర్వాహకులు పరారైన సంఘటన హదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లో చోటుచేసుకుంది. రహమత్‌నగర్‌లో ఉంటున్న దంపతులు కొన్నేళ్లుగా చిట్టీలు నడిపేవారు. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వీరు కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాదాపు ఆరు కోట్ల రూపాయల మేరు వారు మోసం చేసినట్టు బాధితులు వాపోయారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
BY admin5 July 2015 1:08 PM GMT
admin Updated On: 6 July 2015 12:21 AM GMT

Next Story