Telugu Global
Cinema & Entertainment

దండ‌యాత్ర టీమ్ లండ‌న్  జంప్...

ఎన్టీఆర్  లీడ్ రోల్ లో   సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న దండ‌యాత్ర చిత్ర యూనిట్  లండ‌న్ కు వెళ్లిన‌ట్లు తెలుస్తుంది.   తండ్రి సెంటిమెంట్ ఎక్కువుగా ఉండ‌టంతో ఈ సినిమాకు  మొద‌ట్లో ప్రేమ‌తో నాన్న‌కు అనే పేరు ను పెట్టిన‌ట్లు  రూమ‌ర్స్ వినిపించాయి. అయితే ఎన్టీఆర్  కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువుగా వుండ‌టంతో..  మ‌రీ అంత సాఫ్ట్ టైటిల్ అయితే వ‌ర్కువుట్ కాద‌నే  నిర్ణ‌యంతో   ద‌ర్శ‌క నిర్మాత‌లు   దండ‌యాత్ర టైటిల్ ను  రిజిస్ట‌ర్ చేయించార‌ట‌.   ఈ సినిమా షూటింగ్  లండ‌న్ […]

దండ‌యాత్ర టీమ్ లండ‌న్  జంప్...
X

ఎన్టీఆర్ లీడ్ రోల్ లో సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న దండ‌యాత్ర చిత్ర యూనిట్ లండ‌న్ కు వెళ్లిన‌ట్లు తెలుస్తుంది. తండ్రి సెంటిమెంట్ ఎక్కువుగా ఉండ‌టంతో ఈ సినిమాకు మొద‌ట్లో ప్రేమ‌తో నాన్న‌కు అనే పేరు ను పెట్టిన‌ట్లు రూమ‌ర్స్ వినిపించాయి. అయితే ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువుగా వుండ‌టంతో.. మ‌రీ అంత సాఫ్ట్ టైటిల్ అయితే వ‌ర్కువుట్ కాద‌నే నిర్ణ‌యంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు దండ‌యాత్ర టైటిల్ ను రిజిస్ట‌ర్ చేయించార‌ట‌. ఈ సినిమా షూటింగ్ లండ‌న్ లో ఏక థాటిగా 50 రోజుల పాటు జ‌ర‌గ‌నుంద‌ని టాక్.
గ‌తంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ మ‌హేష్ బాబు తో చేసిన వ‌న్ చిత్రం షూటింగ్ తొంభై శాతం లండ‌న్ లోనే షూట్ చేశారు. విజువ‌ల్ ప‌రంగా క్వాలీటి ఉండే త‌లంపు తో ఎక్కువ భాగం అక్క‌డే ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీతిసింగ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌ప‌తి బాబు, రాజేంద్ర ప్ర‌సాద్ లు కీ రోల్ చేస్తున్నారు. మ‌హేష్ బాబు తో చేసిన వ‌న్ చిత్రం క‌థ ప‌రంగా ..వ్యాప‌ర ప‌రంగా షాక్ ఇవ్వ‌డంతో సుకుమార్ ఈ సినిమా తో ఎలాగైన మంచి హిట్ కొట్టాల‌నే క‌సి తో ప‌ని చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. దండ‌యాత్ర సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండ‌గ‌కు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా ద‌ర్శ‌కుడు స‌న్నాహాలు చేస్తున్నారు.

First Published:  5 July 2015 7:12 PM GMT
Next Story